ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ క్వాలిఫయింగ్ విభాగంలో భారత పోరాటం ముగిసింది.
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ క్వాలిఫయింగ్ విభాగంలో భారత పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని 6-7 (5/7), 5-7తో ఫ్రాన్సెస్ తియాఫో (అమెరికా) చేతిలో ఓడిపోయాడు.
భారత్‌కే చెందిన రామ్‌కుమార్ తొలి రౌండ్‌లోనే ఓడిన సంగతి తెలిసిందే. ఫ్రెంచ్ ఓపెన్ ప్రధాన టోర్నమెంట్ ఈనెల 22న మొదలవుతుంది.