చెన్నై : ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో తెలుగుతేజం సాకేత్ మైనేని క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాడు. బుధవారం జరిగిన ప్రి క్వార్టర్స్‌లో సాకేత్ 6-3, 6-2తో ఎనిమిదో సీడ్ థామస్ ఫాబియానో(ఇటలీ)పై అలవోకగా విజయం సాధించాడు. టాప్ సీడ్ సోమ్‌దేవ్, ఏడో సీడ్ యూకీ బాంబ్రీ కూడా క్వార్టర్స్‌కు అర్హత సాధించారు.
ప్రి క్వార్టర్స్‌లో సోమ్‌దేవ్ 6-7 (4/7), 6-0, 6-3తో న్యూజి లాండ్‌కు చెందిన మైకేన్ వీనస్‌పై నెగ్గాడు. మరో మ్యాచ్‌లో యూకీ బాంబ్రీ 6-2, 6-1తో జెరార్డ్ గ్రానోలెర్స్ (స్పెయిన్)పై అలవోకగా విజయం సాధించాడు. సనమ్ సింగ్ 6-1, 4-6, 7-6 (7/1)తో భారత్‌కే చెందిన శ్రీరామ్ బాలాజీపై గెలిచి క్వార్టర్స్‌కు చేరాడు. డబుల్స్‌లో సోమ్‌దేవ్-ఇలిజా జోడి ప్రి క్వార్టర్స్‌లో ఓడిపోగా, యూకీ బాంబ్రీ-వీనస్ జోడి క్వార్టర్స్‌కు చేరింది.
క్వార్టర్స్‌లో సాకేత్
Published Thu, Feb 6 2014 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM
Advertisement
Advertisement