సామియా, గాయత్రి శుభారంభం | samia, gayatri enters second round in all india junior badminton tourny | Sakshi
Sakshi News home page

సామియా, గాయత్రి శుభారంభం

Published Fri, Jul 22 2016 3:06 PM | Last Updated on Mon, Sep 4 2017 5:51 AM

samia, gayatri enters second round in all india junior badminton tourny

ఆలిండియా జూ. ర్యాంకింగ్ బ్యాడ్మింటన్

హైదరాబాద్: ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలంగాణ అమ్మాయిలు సామియా ఇమద్ ఫారూఖి, పుల్లెల గాయత్రి ముందంజ వేశారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన అండర్-17 బాలికల సింగిల్స్ తొలి రౌండ్‌లో సామియా 21-14, 21-12తో ఇషిత (చండీగఢ్)పై, గాయత్రి 21-17, 22-20తో అనన్య గోయెల్ (ఢిల్లీ)పై గెలుపొందారు.

మిగతా మ్యాచ్‌ల్లో మేఘ (ఏపీ) 21-12, 24-22తో రియా ఖత్రి(ఢిల్లీ)పై, శీతల్ 21-16, 21-8తో నిషిత వర్మ (ఏపీ)పై, అక్షిత (ఏపీ) 21-23, 26-24, 21-14తో ఇషిత (తెలంగాణ)పై, సిమ్రాన్ (మహారాష్ట్ర) 21-10, 21-10తో గీతకృష్ణ (ఏపీ)పై, రితిక ఠక్కర్ (మహారాష్ట్ర) 21-10, 21-16తో సాయిశ్రీయాపై విజయం సాధించారు.

అండర్-17 బాలుర సింగిల్స్ తొలి రౌండ్లో కార్తికేయ (ఎయిరిండియా) 21-13, 21-13తో తరుణ్ (ఏపీ) పై, తుకుమ్ (అరుణాచల్ ప్రదేశ్) 21-11, 21-17తో ఇమ్రాన్ షేక్ (ఏపీ)పై, ఉత్సవ్ సోయ్ (ఢిల్లీ) 21-10, 21-19తో చరిత్ (ఏపీ)పై, వేద వ్యాస్ (ఏపీ) 21-9, 21-12తో వంశీకృష్ణ (తెలంగాణ)పై, అంకిత్ కుమార్ (ఉత్తరప్రదేశ్) 21-10, 21-14తో సాయికిరణ్ (ఏపీ)పై, గౌరవ్ మిథే (మహారాష్ట్ర) 21-14, 21-16తో వరప్రసాద్ (ఏపీ)పై, అభ్యాన్ష్ సింగ్ (ఉత్తర ప్రదేశ్) 19-21, 21-11, 21-16తో శ్రీకర్ మదినపై, ప్రణయ్  21-12, 21-7) (ఏపీ)తో జాషన్ సింగ్ (పంజాబ్)పై, కౌషిక్ (తమిళనాడు) 21-16, 21-12తో అనురాగ్ (ఏపీ)పై, జశ్వంత్ (ఏపీ) 21-14, 21-11తో భవేశ్ పాండే (ఉత్తరాఖండ్)పై గెలుపొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement