all india junior badminton tourny
-
విజయవాడలో ఆలిండియా జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీ
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): నవంబర్ 1–8 వరకు ‘ఏపీ సీఎం జగన్ ఆల్ ఇండియా జూనియర్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్ టోర్నమెంట్’ను విజయవాడలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ద్వారకానాథ్ తెలిపారు. అండర్–15, 17 విభాగాల్లో జరిగే ఈ టోర్నీ పోస్టర్‌ను విజయవాడలోని ఓ హోటల్లో ఆదివారం ఆవిష్కరించారు. క్రీడా రంగానికి సీఎం జగన్ ఇస్తోన్న ప్రాధాన్యత జాతీయస్థాయిలో తెలపాలనే ఉద్దేశంతో ఆయన పేరుతో ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశం నలుమూలల నుంచి 2,200 మంది క్రీడాకారులు ఈ టోర్నిలో పాల్గొంటారన్నారు. విజయవాడలోని 3 ఇండోర్ స్టేడియంలలో మ్యాచ్‌లు జరుగుతాయని చెప్పారు. 1న మధాహ్నం 2 గంటలకు టోర్నీని ప్రారంభిస్తారని తెలిపారు. 4వ తేదీ వరకు క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు, తర్వాత మెయిన్ మ్యాచ్‌లు జరుగుతాయన్నారు. 8న బహుమతులను అందజేస్తామన్నారు. -
మూడో రౌండ్లో కేయూర, వంశిక
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ర్యాంకింగ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయిలు మూడో రౌండ్లోకి ప్రవేశించారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సోమవారం జరిగిన అండర్ -19 బాలికల రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో కేయూర (తెలంగాణ) 17-15, 15-12తో నజుక్ వాలియా (పంజాబ్)పై గెలుపొందగా... మరో మ్యాచ్‌లో వంశిక (తెలంగాణ) 15-5, 15-8తో ఆద్య వారియత్ (కేరళ)పై విజయం సాధించింది. మరోవైపు బాలుర మూడోరౌండ్ మ్యాచ్‌ల్లో యశ్వంత్ రామ్ (తెలంగాణ) 10-15, 16-14, 16-14తో శ్రేయాస్ (తమిళనాడు)పై గెలుపొందాడు. ఇతర మ్యాచ్‌ల వివరాలు అండర్-19 బాలికల సింగిల్స్ రెండో రౌండ్ ఫలితాలు: వర్షిత (ఆంధ్రప్రదేశ్) 15-10, 15-13తో పలక్ (మధ్యప్రదేశ్)పై, ప్రీతి (తెలంగాణ) 17-15, 15-12తో బాలాశ్రీ (తమిళనాడు)పై విజయం సాధించారు. బాలుర సింగిల్స్ మూడో రౌండ్ ఫలితాలు: ముకేశ్ (ఆంధ్రప్రదేశ్) 15-11, 15-10తో ప్రశాంత్ శర్మ (గుజరాత్)పై, అచ్యుతాదిత్య రావు (తెలంగాణ) 15-5, 9-15, 15-7తో విజయ్ కార్తీక్ (తమిళనాడు)పై, రోహిత్ రెడ్డి (ఆంధ్ర ప్రదేశ్ ) 15-13, 11-15, 16-14తో పృథ్వీ కపూర్ (తెలంగాణ)పై, సాయికిరణ్ (ఆంధ్రప్రదేశ్) 15-4, 15-8తో దివ్యాంశ్ (మధ్యప్రదేశ్)పై, ఆదిత్య గుప్తా (తెలంగాణ) 15-10, 15-12తో పార్థిక్ (మహారాష్ట్ర)పై గెలుపొందారు. అండర్-17 బాలుర సింగిల్స్ రెండో రౌండ్ ఫలితాలు: అచ్యుతాదిత్య రావు (తెలంగాణ) 15-12, 15-8తో చేతన్ శర్మ (ఉత్తరప్రదేశ్)పై, శ్రీకర్ (ఆంధ్రప్రదేశ్) 15-9, 15-7తో వంశీకృష్ణ (తెలంగాణ)పై, సాయి పృథ్వీ (తెలంగాణ) 15-6, 10-15, 15-5తో విజయ్ కార్తీక్ (తమిళనాడు)పై, ఆదిత్య గుప్తా (తెలంగాణ) 15-9, 15-13తో అఫ్రోజ్ (తమిళనాడు)పై, మిహ తేజ (తెలంగాణ) 15-6, 15-7తో సోమనాథ్ (తమిళనాడు)పై నెగ్గారు. బాలికల సింగిల్స్ రెండోరౌండ్ ఫలితాలు: చక్రయుక్త (తెలంగాణ) 14-16, 15-8, 19-17తో శ్రుతిపై, భార్గవి (తెలంగాణ) 15-6, 15-9తో సాయి శ్రీయ (ఏపీ)పై గెలిచారు. -
సామియా, గాయత్రి శుభారంభం
ఆలిండియా జూ. ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ హైదరాబాద్: ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయిలు సామియా ఇమద్ ఫారూఖి, పుల్లెల గాయత్రి ముందంజ వేశారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన అండర్-17 బాలికల సింగిల్స్ తొలి రౌండ్లో సామియా 21-14, 21-12తో ఇషిత (చండీగఢ్)పై, గాయత్రి 21-17, 22-20తో అనన్య గోయెల్ (ఢిల్లీ)పై గెలుపొందారు. మిగతా మ్యాచ్‌ల్లో మేఘ (ఏపీ) 21-12, 24-22తో రియా ఖత్రి(ఢిల్లీ)పై, శీతల్ 21-16, 21-8తో నిషిత వర్మ (ఏపీ)పై, అక్షిత (ఏపీ) 21-23, 26-24, 21-14తో ఇషిత (తెలంగాణ)పై, సిమ్రాన్ (మహారాష్ట్ర) 21-10, 21-10తో గీతకృష్ణ (ఏపీ)పై, రితిక ఠక్కర్ (మహారాష్ట్ర) 21-10, 21-16తో సాయిశ్రీయాపై విజయం సాధించారు. అండర్-17 బాలుర సింగిల్స్ తొలి రౌండ్లో కార్తికేయ (ఎయిరిండియా) 21-13, 21-13తో తరుణ్ (ఏపీ) పై, తుకుమ్ (అరుణాచల్ ప్రదేశ్) 21-11, 21-17తో ఇమ్రాన్ షేక్ (ఏపీ)పై, ఉత్సవ్ సోయ్ (ఢిల్లీ) 21-10, 21-19తో చరిత్ (ఏపీ)పై, వేద వ్యాస్ (ఏపీ) 21-9, 21-12తో వంశీకృష్ణ (తెలంగాణ)పై, అంకిత్ కుమార్ (ఉత్తరప్రదేశ్) 21-10, 21-14తో సాయికిరణ్ (ఏపీ)పై, గౌరవ్ మిథే (మహారాష్ట్ర) 21-14, 21-16తో వరప్రసాద్ (ఏపీ)పై, అభ్యాన్ష్ సింగ్ (ఉత్తర ప్రదేశ్) 19-21, 21-11, 21-16తో శ్రీకర్ మదినపై, ప్రణయ్ 21-12, 21-7) (ఏపీ)తో జాషన్ సింగ్ (పంజాబ్)పై, కౌషిక్ (తమిళనాడు) 21-16, 21-12తో అనురాగ్ (ఏపీ)పై, జశ్వంత్ (ఏపీ) 21-14, 21-11తో భవేశ్ పాండే (ఉత్తరాఖండ్)పై గెలుపొందారు.