మూడో రౌండ్‌లో కేయూర, వంశిక | keyura, vamsika enter third round in junior badminton tourny | Sakshi
Sakshi News home page

మూడో రౌండ్‌లో కేయూర, వంశిక

Published Tue, Aug 23 2016 11:14 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

keyura, vamsika enter third round in junior badminton tourny

సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ర్యాంకింగ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలంగాణ అమ్మాయిలు మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సోమవారం జరిగిన అండర్ -19 బాలికల రెండో రౌండ్  మ్యాచ్‌ల్లో కేయూర (తెలంగాణ) 17-15, 15-12తో నజుక్ వాలియా (పంజాబ్)పై గెలుపొందగా... మరో మ్యాచ్‌లో వంశిక (తెలంగాణ) 15-5, 15-8తో ఆద్య వారియత్ (కేరళ)పై విజయం సాధించింది. మరోవైపు బాలుర మూడోరౌండ్ మ్యాచ్‌ల్లో యశ్వంత్ రామ్ (తెలంగాణ) 10-15, 16-14, 16-14తో శ్రేయాస్ (తమిళనాడు)పై గెలుపొందాడు.


 ఇతర మ్యాచ్‌ల వివరాలు


 అండర్-19 బాలికల సింగిల్స్ రెండో రౌండ్ ఫలితాలు: వర్షిత (ఆంధ్రప్రదేశ్) 15-10, 15-13తో పలక్  (మధ్యప్రదేశ్)పై, ప్రీతి (తెలంగాణ) 17-15, 15-12తో బాలాశ్రీ (తమిళనాడు)పై విజయం సాధించారు.


 బాలుర సింగిల్స్ మూడో రౌండ్ ఫలితాలు: ముకేశ్ (ఆంధ్రప్రదేశ్) 15-11, 15-10తో ప్రశాంత్ శర్మ (గుజరాత్)పై, అచ్యుతాదిత్య రావు (తెలంగాణ) 15-5, 9-15, 15-7తో విజయ్ కార్తీక్ (తమిళనాడు)పై, రోహిత్ రెడ్డి (ఆంధ్ర  ప్రదేశ్ ) 15-13, 11-15, 16-14తో పృథ్వీ కపూర్ (తెలంగాణ)పై, సాయికిరణ్ (ఆంధ్రప్రదేశ్) 15-4, 15-8తో దివ్యాంశ్ (మధ్యప్రదేశ్)పై, ఆదిత్య గుప్తా (తెలంగాణ) 15-10, 15-12తో పార్థిక్ (మహారాష్ట్ర)పై గెలుపొందారు.


 అండర్-17 బాలుర సింగిల్స్ రెండో రౌండ్ ఫలితాలు: అచ్యుతాదిత్య రావు (తెలంగాణ) 15-12, 15-8తో చేతన్ శర్మ (ఉత్తరప్రదేశ్)పై, శ్రీకర్ (ఆంధ్రప్రదేశ్) 15-9, 15-7తో వంశీకృష్ణ (తెలంగాణ)పై, సాయి పృథ్వీ (తెలంగాణ) 15-6, 10-15, 15-5తో విజయ్ కార్తీక్ (తమిళనాడు)పై, ఆదిత్య గుప్తా (తెలంగాణ) 15-9, 15-13తో అఫ్రోజ్ (తమిళనాడు)పై, మిహ తేజ (తెలంగాణ) 15-6, 15-7తో సోమనాథ్ (తమిళనాడు)పై నెగ్గారు.


 బాలికల సింగిల్స్ రెండోరౌండ్ ఫలితాలు: చక్రయుక్త (తెలంగాణ) 14-16, 15-8, 19-17తో శ్రుతిపై, భార్గవి (తెలంగాణ) 15-6, 15-9తో సాయి శ్రీయ (ఏపీ)పై గెలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement