పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న అసోసియేషన్ సభ్యులు
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): నవంబర్ 1–8 వరకు ‘ఏపీ సీఎం జగన్ ఆల్ ఇండియా జూనియర్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్ టోర్నమెంట్’ను విజయవాడలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ద్వారకానాథ్ తెలిపారు. అండర్–15, 17 విభాగాల్లో జరిగే ఈ టోర్నీ పోస్టర్‌ను విజయవాడలోని ఓ హోటల్‌లో ఆదివారం ఆవిష్కరించారు.
క్రీడా రంగానికి సీఎం జగన్ ఇస్తోన్న ప్రాధాన్యత జాతీయస్థాయిలో తెలపాలనే ఉద్దేశంతో ఆయన పేరుతో ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశం నలుమూలల నుంచి 2,200 మంది క్రీడాకారులు ఈ టోర్నిలో పాల్గొంటారన్నారు. విజయవాడలోని 3 ఇండోర్ స్టేడియంలలో మ్యాచ్‌లు జరుగుతాయని చెప్పారు. 1న మధాహ్నం 2 గంటలకు టోర్నీని ప్రారంభిస్తారని తెలిపారు. 4వ తేదీ వరకు క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు, తర్వాత మెయిన్ మ్యాచ్‌లు జరుగుతాయన్నారు. 8న బహుమతులను అందజేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment