ఎస్‌సీఆర్ జట్టుకే టైటిల్ | scr gets kabaddy title | Sakshi
Sakshi News home page

ఎస్‌సీఆర్ జట్టుకే టైటిల్

Published Sun, Sep 25 2016 11:36 AM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM

scr gets kabaddy title

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి వార్షిక ఎ-లీగ్ ఇంటర్ డిపార్ట్‌మెంటల్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్‌సీఆర్) జట్టు టైటిల్‌ను కై వసం చేసుకుంది. తెలంగాణ కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్లో ఎస్‌సీఆర్ జట్టు 20-12తో ఇన్‌కమ్ టాక్స్ జట్టుపై అవలీలగా విజయాన్ని సాధించింది.

 

ఈ మ్యాచ్‌లో ఎస్‌సీఆర్ తరఫున ప్రదీప్, అంకిరెడ్డి రాణించగా... ఇన్‌కమ్ టాక్స్ జట్టులో శ్రీకృష్ణ, మల్లేశ్ ఆకట్టుకున్నారు. అంతకుముందు జరిగిన తొలి సెమీఫైనల్లో ఇన్‌కమ్ టాక్స్ జట్టు 16-8తో ఆంధ్రా బ్యాంక్‌పై గెలుపొందగా... రెండో సెమీస్‌లో ఎస్‌సీఆర్ జట్టు 16-6తో ‘సాయ్’ ఎసీటీసీ జట్టును ఓడించింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో శాట్స్ ఎండీ దినకర్‌బాబు పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందజేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement