బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రి విజేత వెటెల్‌ | Sebastian Vettel beats Lewis Hamilton in Bahrain thriller | Sakshi
Sakshi News home page

బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రి విజేత వెటెల్‌

Published Mon, Apr 17 2017 1:16 AM | Last Updated on Wed, Aug 1 2018 4:17 PM

బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రి విజేత వెటెల్‌ - Sakshi

బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రి విజేత వెటెల్‌

మనామా: ఆద్యంతం ఉత్కంఠభరింగా సాగిన బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్‌ రేసులో ఫెరారీ డ్రైవర్‌ సెబాస్టియన్‌ వెటెల్‌ విజేతగా నిలిచాడు. 57 ల్యాప్‌ల ఈ రేసును వెటెల్‌ గంటా 33 నిమిషాల 53.373 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఈ సీజన్‌లో వెటెల్‌కిది రెండో విజయం.

‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ఆరంభించిన బొటాస్‌ (మెర్సిడెస్‌) మూడో స్థానంతో సరిపెట్టుకోగా... హామిల్టన్‌ (మెర్సిడెస్‌) రెండో స్థానంలో నిలిచాడు. భారత్‌కు చెందిన ఫోర్స్‌ ఇండియా డ్రైవర్లు పెరెజ్, ఒకాన్‌ వరుసగా ఎనిమిది, పదో స్థానాల్లో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు రష్యా గ్రాండ్‌ప్రి ఏప్రిల్‌ 30న జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement