పారిస్: నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఫార్ములావన్ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ ఈ ఏడాది ఫెరారీ జట్టును వీడనున్నాడు. ‘మేం కలిసి పనిచేయడానికి ఇకపై అవకాశం లేదు. ఫెరారీతో నా బంధం ఈ ఏడాదితో ముగియనుంది. నేను, ఫెరారీ ఎఫ్1 టీమ్ కలిసి తీసుకున్న నిర్ణయం ఇది’ అని వెటెల్ పేర్కొన్నాడు. ఎన్నో అంచనాల నడుమ 2015లో ఫెరారీతో జతకట్టిన వెటెల్... మరో ‘మైకేల్ çషుమాకర్ (జర్మనీ)–ఫెరారీ’ బంధంలా ఎఫ్1ను శాసిస్తుందని అందరూ ఊహించారు. అయితే వెటెల్– ఫెరారీ ద్వయం ఆ అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఫెరారీ డ్రైవర్‌గా ఇప్పటి వరకు వెటెల్ 103 రేసుల్లో పాల్గొనగా కేవలం 14 రేసుల్లో మాత్రమే విజేతగా నిలిచాడు. 2017, 2018 సీజన్‌లో డ్రైవర్ ప్రపంచ చాంపియన్ రన్నరప్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment