
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో భారత క్రికెట్ జట్టు ఘోరంగా ఓడిపోవడంపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అసలు కనీసం పోరాడకుండానే భారత జట్టు లొంగిపోవడాన్ని సెహ్వాగ్ తప్పుబట్టాడు. తొలి టెస్టులో ఓటమి తర్వాత అంతా జట్టుకు అండగా ఉందామని అనుకున్నా, వారు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడం నిరాశను మిగిల్చిందన్నాడు.
ఈ మేరకు తన ట్వీటర్ అకౌంట్‌లో జట్టు ప్రదర్శనపై విమర్శలు చేశాడు. ‘ ఇది చాలా పేలవ ప్రదర్శన. మీకు మద్దతుగా ఉండటానికి మేమంతా సిద్దంగా ఉన్నా, మీరు మాత్రం ఘోర వైఫల్యం చెందారు. కనీసం పోరాడకుండానే లొంగిపోవడం నిరాశకు గురి చేసింది. ఈ తరహా ప్రదర్శనతో మ్యాచ్‌లు చూడాలంటే నిరుత్సాహానికి గురి చేస్తోంది’ అని సెహ్వాగ్ మండిపడ్డాడు. తదుపరి టెస్టు నాటికి భారత జట్టు మానసిక బలాన్ని మూటుగట్టుకుని గాడిలో పడుతుందని సెహ్వాగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment