ముగ్గురి కథ ముగిసినట్లేనా? | Sehwag, Zaheer, Harbhajan omitted from BCCI contract | Sakshi
Sakshi News home page

ముగ్గురి కథ ముగిసినట్లేనా?

Published Fri, Nov 15 2013 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM

Sehwag, Zaheer, Harbhajan omitted from BCCI contract

ముంబై: జాతీయ జట్టులోకి పునరాగమనం చేయాలనుకుంటున్న డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్, పేసర్ జహీర్ ఖాన్, స్పిన్నర్ హర్భజన్ సింగ్‌లకు బీసీసీఐ షాకిచ్చింది. 2013-14 ఏడాది కోసం ఎంపిక చేసిన ఒప్పంద ఆటగాళ్ల జాబితా నుంచి ఈ ముగ్గుర్ని తొలగించింది. దీంతో వీళ్ల కెరీర్ ఇక ముగిసినట్టేనని ఊహాగానాలు మొదలయ్యాయి. మొత్తం 25 మందితో బోర్డు ఒప్పందం చేసుకోనుంది. కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్న సచిన్ ఈ సీజన్‌లో రెండు టెస్టులు ఆడినందుకు అతన్ని గ్రేడ్ ‘ఎ’లో కొనసాగించారు. గ్రేడ్-ఎ ఆటగాళ్లకు కోటి, గ్రేడ్-బి, సి క్రికెటర్లకు వరుసగా 50, 25 లక్షల చొప్పున చెల్లిస్తారు.
 
 ఆటగాళ్ల కాంట్రాక్టుల జాబితా
 గ్రేడ్-ఎ: సచిన్, ధోని, కోహ్లి, రైనా, అశ్విన్.
 గ్రేడ్-బి: గంభీర్, యువరాజ్, ఓజా, ఇషాంత్, మురళీ విజయ్, ధావన్, ఉమేశ్, పుజారా, జడేజా, భువనేశ్వర్, రోహిత్.
 
 గ్రేడ్-సి: దినేశ్ కార్తీక్, మిశ్రా, వృద్ధిమాన్ సాహా, రహానే, రాయుడు, వినయ్, షమీ, ఉనాద్కట్, మోహిత్ శర్మ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement