'నేను రాజీనామా చేయలేదు' | sepp blatter says, he did not resign as fifa president | Sakshi
Sakshi News home page

'నేను రాజీనామా చేయలేదు'

Published Fri, Jun 26 2015 6:19 PM | Last Updated on Fri, Jun 15 2018 4:33 PM

'నేను రాజీనామా చేయలేదు' - Sakshi

'నేను రాజీనామా చేయలేదు'

జ్యురిచ్:అంతర్జాతీయ ఫుట్ బాల్ సంఘాల సమాఖ్య(ఫిఫా)లో చెలరేగిన  వివాదాలకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేటట్లు కనబడుట లేదు. ఇప్పటికే అవినీతి వివాదాలతో సతమవుతున్నఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్  అగ్నికి మరోసారి ఆజ్యం పోసే యత్నం చేశాడు.  ఫిఫా అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నట్లు కొన్ని రోజుల క్రితం బ్లాటర్ ప్రకటించినా..   అసలు రాజీనామానే చేయలేదని తాజాగా పేర్కొన్నాడు.

గత నెల్లో జరిగిన ఎన్నికల్లో ఐదోసారి ఫిఫా అధ్యక్షుడిగా ఎన్నికైన బ్లాటర్... తరువాత నాలుగు రోజులకే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.  తన వారసుడిని ఎన్నుకోవడానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని కూడా మీడియాకు తెలిపాడు. అయితే నిబంధనల ప్రకారం బ్లాటర్ డిసెంబర్ వరకు పదవిలో కొనసాగనున్న నేపధ్యంలో తన రాజీనామాపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement