
సాక్షి, చెన్నై : బాలీవుడ్ నటుడు, కోల్‌కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారుఖ్ ఖాన్, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని భార్య సాక్షిని హగ్ చేసుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య గత మంగళవారం జరిగిన ఐపీఎల్ టీ20 మ్యాచ్ అనంతరం వీరు ఇలా పలకరించుకున్నారు. అయితే ఒకరు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్, మరొకరు స్టార్ క్రికెటర్ ధోని భార్య సాక్షి కావడంతో ఇప్పుడిది హాట్ టాపిక్ అయింది. అయితే ఈ మ్యాచ్‌లో ధోని నేతృత్వంలోని చెన్నై జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. సొంత జట్టు కోల్‌కతా ఓటమి తర్వాత కూడా చాలా కూల్‌గా ఉన్న కింగ్ ఖాన్ మ్యాచ్ ముగిసిన అనంతరం ధోని కూతురు జీవాతో సెల్ఫీలు దిగి సందడి చేయగా ఆ ఫొటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment