
కూతురు జీవాతో ధోని
సాక్షి, చెన్నై: చెన్నై-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఉత్కంఠ పోరు అనంతరం చెన్నై కెప్టెన్ ధోని కూతురితో షారుఖ్ ఖాన్ సెల్ఫీకి పోజిచ్చారు. కేకేఆర్‌పై చెన్నై గెలుపు అనంతరం సంబరాలు జరుపుకుంటున్న జీవాను దగ్గరకు తీసుకున్న షారుఖ్ ఫోటో దిగారు.
చెపాక్ స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఓటమి తర్వాత కూడా కూల్‌గా కనిపించిన షారుఖ్ జీవాతో ఆనందంగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్‌మీడియలో వైరల్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment