కాబోల్: క్రికెట్ బోర్డు నియమావళిని ఉల్లఘించినందుకు అఫ్గానిస్తాన్ క్రికెటర్ మహ్మద్ షెహజాద్‌పై ఏడాది నిషేధం పడింది. ఇటీవల షెహజాద్‌పై నిరవధిక నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్న అఫ్గాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ).. తాజాగా శిక్షను ఖరారు చేసింది. బోర్డుకు చెప్పకుండా విదేశీ పర్యటనలకు వెళ్లాడనే ఆరోపణలపై షెహజాద్‌పై నిషేధాన్ని విధించింది. తమ దేశ క్రికెటర్ ఎటువంటి బోర్డు అనుమతులు లేకుండా విదేశీ పర్యటన చేయడం నిబంధనలకు విరుద్ధం కావడంతో ఏసీబీ ఈ మేరకు చర్యలకు చేపట్టింది.
అదే సమయంలో ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్తాన్ రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వాత షెహజాద్ ఫిట్‌గా లేడంటూ మిగతా మ్యాచ్‌ల నుంచి తప్పించింది. దాంతో అఫ్గాన్ బోర్డుపై షెహజాద్ ధ్వజమెత్తాడు. తాను ఫిట్‌గా ఉన్నప్పటికీ బోర్డు తనను కావాలనే తొలగించిందని, ఇదే తనపై కొంతమంది బోర్డు పెద్దలు కుట్ర చేశారని మండిపడ్డాడు. వీటిని సీరియస్‌గా పరిగణించిన అఫ్గాన్ బోర్డు.. షెహజాద్‌పై ఏడాది నిషేధం విధించింది. ఈ కాలంలో ఏ ఫార్మాట్ క్రికెట్ ఆడకూడదంటూ ఆంక్షల్లో పేర్కొంది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని బోర్డు స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment