షమీని కూల్ చేసిన ధోని! | Shami Loses Cool Over 'Baap Kaun Hai' Taunt From Pakistani Fan | Sakshi
Sakshi News home page

షమీని కూల్ చేసిన ధోని!

Published Tue, Jun 20 2017 11:22 AM | Last Updated on Tue, Sep 5 2017 2:04 PM

షమీని కూల్ చేసిన ధోని!

షమీని కూల్ చేసిన ధోని!

లండన్: ఒక జట్టు గెలిచినప్పుడు అభిమానులకు ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. కానీ అది కాస్తా హెచ్చుమీరతే విపరీతాలు జరుగుతాయి. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు ముందు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కారును అడ్డగించిన రాద్దాంతం చేసిన పాకిస్తాన్ అభిమానులు.. తుది పోరులో వారి జట్టు గెలిచిన తరువాత కూడా భారత్ క్రికెటర్లపై తమ అక్కసును వెళ్లగక్కారు. మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ జట్టును అభినందించేందుకు భారత్ క్రికెటర్లు మైదానంలోకి వచ్చారు.

 

ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరిని ఒకరు పలకరించుకున్న తరువాత భారత క్రికెటర్లు తిరిగి స్టేడియంలోకి వెళ్లే క్రమంలో పాకిస్తాన్ అభిమాని హద్దులు మీరాడు. భారత క్రికెటర్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దురుసుగా ప్రవర్తించాడు. 'బాప్ కౌన్ హై' అంటూ రెచ్చగొట్టే యత్నం చేశాడు. దీంతో కాస్త సహనం కోల్పోయిన భారత పేసర్ మొహ్మద్ షమీ ఆ అభిమాన్ని సమీపించే యత్నం చేశాడు. అయితే వెనకాల వస్తున్న మహేంద్ర సింగ్ ధోని.. షమీని కూల్ చేసి తనతో లోపలకి తీసుకెళ్లిపోయాడు. భారత జట్టుపై దురుసుగా ప్రవర్తించిన సదరు పాకిస్తాన్ అభిమాన్ని భద్రతా సిబ్బంది అక్కడ్నుంచి పంపించి వేశారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా  మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement