ట్విట్టర్‌లో శిఖర్ ధావన్
న్యూఢిల్లీ: భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ సామాజిక అనుసంధాన వేదిక ‘ట్విట్టర్’లో చేరాడు. SDhawan25 అనే యూజర్‌నేమ్‌తో ఈ ఖాతాను తెరిచాడు. ‘ఎట్టకేలకు నేను ట్విట్టర్‌లో చేరా! ప్రతి ఒక్కరితో అనుసంధానం అవుతున్నందుకు చాలా ఉత్సాహంగా ఉంది’ అని ప్రస్తుతం అడిలైడ్‌లో టెస్టు మ్యాచ్ ఆడుతున్న ధావన్ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్‌కు అభిమానులు కూడా బాగానే స్పందించారు. ఓవరాల్‌గా 2400 మంది ఫాలోవర్లు ధావన్‌ను అనుసరిస్తున్నారు. శిఖర్ ట్విట్టర్‌లో చేరినందుకు చాలా సంతోషంగా ఉందని న్యూ మీడియా డెరైక్టర్ జోగేష్ లూలా అన్నారు.