సాక్షి, హైదరాబాద్: షూటర్ ఇషా సింగ్, క్రికెటర్ ప్రణవి చంద్రలకు అండగా నిలిచేందుకు ప్రముఖ ప్రాపర్టీ సంస్థ ముందుకు వచ్చింది. వీరిద్దరికీ ‘పూజ క్రాఫ్టెడ్ హోమ్స్’ స్పాన్సర్‌షిప్ అందించనుంది. గత నెలలో జర్మనీలో జూనియర్ వరల్డ్ కప్ (ఎయిర్ పిస్టల్)లో ఇషా రజ తం గెలిచింది. త్వరలోనే ఈ 14 ఏళ్ల అమ్మాయి ప్రాక్టీస్, టోర్నీల్లో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళుతోంది. 17 ఏళ్ల ప్రణవి చంద్ర ఇటీవలే ఇంగ్లండ్‌లో లీ పెరీ వద్ద ప్రత్యేక శిక్షణ పొందిం ది. అర్జున్ టెండూల్కర్‌కు పెరీ శిక్షకుడు కావడం విశేషం. త్వరలోనే ఆమె కోచింగ్ కోసం ఆస్ట్రేలియాలోని గ్రెగ్ చాపెల్ అకాడమీకి కూడా వెళ్లనుంది.
వీరిద్దరి ప్రతిభను చూసి తాము ఆర్థిక సహకారం అందించేందుకు ముందుకు వచ్చామని, భవిష్యత్తులో ఈ అమ్మాయిలు మరి న్ని మంచి ఫలితాలు సాధిస్తారని ఆశిస్తున్నట్లు ‘పూజ క్రాఫ్టెడ్ హోమ్స్’ ఎండీ శౌరి రెడ్డి అన్నా రు. బ్యాడ్మింటన్ ప్లేయర్లు పీవీ సింధు, పుల్లెల గాయత్రిలకు కూడా ప్రస్తుతం ‘పూజ’ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు వి.చాముండేశ్వరీనాథ్ కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment