స్వర్ణంపై గురి !
ఏషియూడ్‌కు షూటర్ సంజీవ్ సన్నాహాలు
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో భారత్‌కు పతకాలు అందించే క్రీడల్లో షూటింగ్ కూడా ఒకటి. ఇక గత ఏషియూడ్ రజత పతక విజేత, షూటర్ సంజీవ్ రాజ్‌పుత్ వురోసారి పతకంపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. దక్షిణ కొరియూలోని ఇంచియూన్‌లో ఈ నెల 19న మొదలయ్యే ఈ పోటీల్లో బంగారు పతకం సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నాడు. రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో పోటీపడనున్న రాజ్‌పుత్ ముడేళ్ల కిందట చాంగ్‌వోన్ (దక్షిణకొరియూ)లో జరిగిన ప్రపంచకప్‌లో ఇదే విభాగంలో స్వర్ణం సాధించాడు. ఆసియూ క్రీడలకు దక్షిణ కొరియూ ఆతిథ్యమిస్తుండటంతో అక్కడి పరిస్థితులు తనకు పతకం సాధించిపెట్టడంలో కీలకపాత్ర పోషిస్తాయుని భావిస్తున్నాడు.
ఆసియూ క్రీడల కోసం తనలోని లోపాలపై సంజీవ్ రాజ్‌పుత్ దృష్టిపెట్టాడు. నీలింగ్, ప్రోన్ పొజిషన్‌లలో గతంలో బలహీనతలు బయుటపడ్డాయి. వాటిని సరిచేసుకునేందుకు ఎక్కువ సవువుయుం కేటాయిస్తున్నాడు. ఆసియూ క్రీడల కోసం కొద్ది రోజుల పాటు షూటర్లు విదేశాల్లో శిక్షణ తీసుకున్నారు. అయితే విదేశాల్లో ఈ శిక్షణ 15 రోజుల పాటు జరిగి ఉంటే తవు ప్రదర్శన ఇంకా మెరుగై ఉండేదన్నాడు. వురో రెండు రోజుల్లో స్పెయిన్‌లో ప్రపంచ షూటింగ్ చాంపియున్‌షిప్‌లో రాజ్‌పుత్ పాల్గొననున్నాడు. ఈ టోర్నీలో రాణిస్తే 2016 రియో ఒలింపిక్స్‌లో బెర్త్ దక్కించుకోవచ్చు.