Sanjeev Rajput
-
సంజీవ్‌కు రజతం
రియో డి జనీరో (బ్రెజిల్): ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు మరో పతకం లభించింది. గురువారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో సంజీవ్ రాజ్‌పుత్ రజత పతకాన్ని గెల్చుకున్నాడు. దాంతోపాటు భారత్‌కు 2020 టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌ను అందించాడు. ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో సంజీవ్ 462 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. పీటర్ గోర్సా (క్రొయేషియా-462.2 పాయింట్లు) స్వర్ణం, జాంగ్ చాంగ్‌హాంగ్ (చైనా-449.2 పాయింట్లు) కాంస్యం గెలిచారు. ఆఖరి షాట్ వరకు పాయింట్ ఆధిక్యంలో ఉండి పసిడి రేసులో నిలిచిన సంజీవ్ చివరి షాట్లో 8.8 పాయింట్ల షాట్ కొట్టి మూల్యం చెల్లించుకున్నాడు. పీటర్ గోర్సా చివరి షాట్లో 10 పాయింట్ల షాట్ కొట్టి స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. బుధవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత షూటర్ ఇలవేనిల్ వలరివాన్ స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్లు అభిషేక్ వర్మ, సౌరభ్ చౌధరీ ఫైనల్‌కు చేరుకున్నారు. -
ఏషియన్ గేమ్స్: ‘రజత’ రాజ్‌పుత్
జకార్తా: ఏషియన్ గేమ్స్ 2018లో భాగంగా భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. భారత స్టార్ షూటర్ సంజీవ్ రాజ్‌పుత్ రజత పతకాన్ని సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల 50 మీటర్ల త్రీ పొజిషన్ ఫైనల్లో రాజ్‌పుత్ ఆద్యంతం ఆకట్టుకుని రజతాన్ని ఖాయం చేసుకున్నాడు. మొత్తంగా 452. 7 పాయింట్ల స్కోరు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. దాంతో ఇప్పటివరకూ భారత్ సాధించిన పతకాల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. ఇందులో మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్యాలు ఉన్నాయి. అంతకుముందు ఈ రోజు క్రీడల్లో సౌరభ్ చౌదరి స్వర్ణ పతకాన్ని సాధించాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భాగంగా ఫైనల్ పోరులో సౌరభ్ చౌదరి 240.7 పాయింట్లు సాధించి పసిడిని ఖాతాలో వేసుకున్నాడు. ఇదే విభాగంలో మరో భారత షూటర్ అభిషేక్ వర్మ కాంస్య పతకాన్ని సాధించాడు. మొత్తంగా 219.3 పాయింట్ల స్కోరు సాధించి కాంస్యాన్ని దక్కించుకున్నాడు. చదవండి: పరిమళించిన యువ ‘సౌరభం’ -
చెయిన్ స్థానంలో రాజ్‌పుత్!
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత షూటింగ్ జట్టులో ఒక మార్పు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో చెయిన్ సింగ్ స్థానంలో సంజీవ్ రాజ్‌పుత్ బరిలో దిగే చాన్స్ ఉంది. స్విట్జర్లాండ్‌లో శిక్షణ సందర్భంగా చెయిన్ సింగ్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఈ మార్పు అనివార్యంగా అనిపిస్తోంది. ఒలింపిక్స్‌కు మరో పది రోజుల సమయమే ఉన్నందున చెయిన్ సింగ్ కోలుకునే అవకాశాలు కనిపించడంలేదు. గత జనవరిలో జరిగిన ఆసియా క్వాలిఫయింగ్ ఈవెంట్లో సంజీవ్ రాజ్‌పుత్ భారత్‌కు ‘రియో’ బెర్త్ అందించాడు. అయితే సెలెక్షన్ ర్యాంకింగ్స్‌లో రాజ్‌పుత్ కంటే గగన్ నారంగ్ ముందుండటంతో రాజ్‌పుత్‌కు చోటు లభించలేదు. చెయిన్ సింగ్ అనారోగ్యం కారణంగా రాజ్‌పుత్‌కు రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే ఆశలు చిగురించాయి. ఇటీవల అజర్బైజాన్లో జరిగిన ప్రపంచకప్‌లో సంజీవ్ రజతం సాధించి ఫామ్‌లో ఉండటం అతనికి అనుకూలించే అంశం. -
‘రజత’ రాజ్‌పుత్
ఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత షూటర్ సంజీవ్ రాజ్‌ఫుత్ రజత పతకాన్ని సాధించాడు. అజర్‌బైజాన్‌లోని బాకు నగరంలో జరిగిన ఈ ఈవెంట్లో రాజ్‌పుత్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో రెండో స్థానాన్ని సంపాదించాడు. ఫైనల్లో రాజ్‌పుత్ 456.9 పాయింట్లు స్కోరు చేశాడు. భారత్‌కే చెందిన గగన్ నారంగ్ 23వ, చెయిన్ సింగ్ 32వ స్థానంలో నిలిచారు. -
షూటర్ రాజ్‌పుత్‌కు రజతం
బాకు(అజర్బైజాన్):ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్(ఐఎస్ఎస్ఎఫ్) వరల్డ్ కప్‌లో భారత షూటర్ సంజీవ్ రాజ్‌పుత్ రజతం సాధించాడు. అజర్ బైజాన్‌లో జరుగుతున్న ప్రపంచకప్ టోర్నమెంట్లో ఆద్యంత ఆకట్టుకున్న రాజ్ పుత్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకున్నాడు. పురుషుల 50 మీటర్ల త్రీ పొజిషన్లో 456.9 పాయింట్ల స్కోరు చేసి రజతాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ పోటీలో కొరేషియా షూటర్ పీటర్ గోర్సా 4 57.5 పాయింట్ల స్కోరుతో స్వర్ణాన్ని సాధించగా, కొరియా షూటర్ హైన్జున్ కిమ్ 445.5 స్కోరుతో కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ఇదిలా ఉండగా, మరో భారత షూటర్ జితూ రాయ్ 10 మీ ఎయిర్ రైఫిల్ విభాగంలో రజతం సాధించాడు. దీంతో భారత్ ఖాతాలో రెండు రజతాలు చేరాయి. కాగా, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత షూటర్ గగన్ నారంగ్ 1161 పాయింట్ల స్కోరు చేసి 23వ స్థానంలో నిలిచాడు. -
రాజ్‌పుత్ స్థానంలో మానవ్‌జిత్
రియో ఒలింపిక్స్‌కు భారత షూటింగ్ జట్టు ప్రకటన న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత షూటింగ్ జట్టును ప్రకటించారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో ‘రియో బెర్త్’ను దక్కించుకున్న సంజీవ్ రాజ్‌పుత్ భారత జట్టులో స్థానం కోల్పోయాడు. సెలక్షన్ ట్రయల్స్‌లో ట్రాప్ షూటర్ , ప్రపంచ మాజీ చాంపియన్ మానవ్‌జిత్ సింగ్ సంధూ నిలకడగా పాయింట్లు సాధించి రియో ఒలింపిక్స్‌కు ఎంపికయ్యాడు. షూటింగ్లో భారత్ మొత్తం 12 బెర్త్‌లను సంపాదించింది. రాజ్‌పుత్ మినహా తమ కేటగిరీల్లో బెర్త్‌లను దక్కించుకున్న మిగతా 11 మంది షూటర్లు జాతీయ జట్టులోకి ఎంపికయ్యారు. హైదరాబాద్ నుంచి గగన్ నారంగ్, కైనన్ చెనాయ్ రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటారు. రియో ఒలింపిక్స్‌కు భారత షూటింగ్ జట్టు: అభినవ్ బింద్రా, గగన్ నారంగ్, చెయిన్ సింగ్, జీతూ రాయ్, గుర్ప్రీత్ సింగ్, ప్రకాశ్ నంజప్ప, మానవ్‌జిత్ సంధూ, కైనన్ చెనాయ్, మేరాజ్ అహ్మద్ ఖాన్, అపూర్వీ చండీలా, అయోనిక పాల్, హీనా సిద్ధూ. -
స్వర్ణంపై గురి !
ఏషియూడ్కు షూటర్ సంజీవ్ సన్నాహాలు న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో భారత్‌కు పతకాలు అందించే క్రీడల్లో షూటింగ్ కూడా ఒకటి. ఇక గత ఏషియూడ్ రజత పతక విజేత, షూటర్ సంజీవ్ రాజ్‌పుత్ వురోసారి పతకంపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. దక్షిణ కొరియూలోని ఇంచియూన్‌లో ఈ నెల 19న మొదలయ్యే ఈ పోటీల్లో బంగారు పతకం సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నాడు. రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో పోటీపడనున్న రాజ్‌పుత్ ముడేళ్ల కిందట చాంగ్వోన్ (దక్షిణకొరియూ)లో జరిగిన ప్రపంచకప్‌లో ఇదే విభాగంలో స్వర్ణం సాధించాడు. ఆసియూ క్రీడలకు దక్షిణ కొరియూ ఆతిథ్యమిస్తుండటంతో అక్కడి పరిస్థితులు తనకు పతకం సాధించిపెట్టడంలో కీలకపాత్ర పోషిస్తాయుని భావిస్తున్నాడు. ఆసియూ క్రీడల కోసం తనలోని లోపాలపై సంజీవ్ రాజ్‌పుత్ దృష్టిపెట్టాడు. నీలింగ్, ప్రోన్ పొజిషన్లలో గతంలో బలహీనతలు బయుటపడ్డాయి. వాటిని సరిచేసుకునేందుకు ఎక్కువ సవువుయుం కేటాయిస్తున్నాడు. ఆసియూ క్రీడల కోసం కొద్ది రోజుల పాటు షూటర్లు విదేశాల్లో శిక్షణ తీసుకున్నారు. అయితే విదేశాల్లో ఈ శిక్షణ 15 రోజుల పాటు జరిగి ఉంటే తవు ప్రదర్శన ఇంకా మెరుగై ఉండేదన్నాడు. వురో రెండు రోజుల్లో స్పెయిన్‌లో ప్రపంచ షూటింగ్ చాంపియున్‌షిప్‌లో రాజ్‌పుత్ పాల్గొననున్నాడు. ఈ టోర్నీలో రాణిస్తే 2016 రియో ఒలింపిక్స్‌లో బెర్త్ దక్కించుకోవచ్చు.