చెయిన్ స్థానంలో రాజ్‌పుత్! | Rio: Chain Singh unwell, shooting body can look at Rajput as a replacement | Sakshi
Sakshi News home page

చెయిన్ స్థానంలో రాజ్‌పుత్!

Published Tue, Jul 26 2016 12:15 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

చెయిన్ స్థానంలో రాజ్‌పుత్!

చెయిన్ స్థానంలో రాజ్‌పుత్!

న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత షూటింగ్ జట్టులో ఒక మార్పు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో చెయిన్ సింగ్ స్థానంలో సంజీవ్ రాజ్‌పుత్ బరిలో దిగే చాన్స్ ఉంది. స్విట్జర్లాండ్‌లో శిక్షణ సందర్భంగా చెయిన్ సింగ్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఈ మార్పు అనివార్యంగా అనిపిస్తోంది. ఒలింపిక్స్‌కు మరో పది రోజుల సమయమే ఉన్నందున చెయిన్ సింగ్ కోలుకునే అవకాశాలు కనిపించడంలేదు. గత జనవరిలో జరిగిన ఆసియా క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో సంజీవ్ రాజ్‌పుత్ భారత్‌కు ‘రియో’ బెర్త్ అందించాడు.

అయితే సెలెక్షన్ ర్యాంకింగ్స్‌లో రాజ్‌పుత్ కంటే గగన్ నారంగ్ ముందుండటంతో రాజ్‌పుత్‌కు చోటు లభించలేదు. చెయిన్ సింగ్ అనారోగ్యం కారణంగా రాజ్‌పుత్‌కు రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే ఆశలు చిగురించాయి. ఇటీవల అజర్‌బైజాన్‌లో జరిగిన ప్రపంచకప్‌లో సంజీవ్ రజతం సాధించి ఫామ్‌లో ఉండటం అతనికి అనుకూలించే అంశం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement