జైపూర్: ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన అన్‌క్యాప్‌డ్ భారత ఆటగాళ్ల జాబితాలో గోపాల్ ఐదో స్థానంలో నిలిచాడు. శనివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గోపాల్ 16 పరుగులిచ్చి 4 వికెట్లతో సత్తాచాటాడు. ఫలితంగా అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన ఐదో అన్‌క్యాప్‌డ్ భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో అంకిత్ రాజ్‌పుత్ (5/14-2018 ఐపీఎల్) తొలి స్థానంలో ఉండగా, అజిత్ చండీల్లా(4/13-2012 ఐపీఎల్) రెండో స్థానంలో, ఎస్ అరవింద్(4/14-2011 ఐపీఎల్) మూడో స్థానంలో, భాటియా(4/15-2009 ఐపీఎల్) నాల్గో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానాన్ని శ్రేయస్ గోపాల్ ఆక‍్రమించాడు.
ఆర్సీబీ జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రేయస్ గోపాల్ స్పిన్ దెబ్బకు విలవిల్లాడిన ఆర్సీబీ 134 పరుగులకే ఆలౌటై ఓటమి పాలైంది. తద్వారా ఐపీఎల్ తాజా సీజన్ నుంచి ఆర్సీబీ నిష్క్రమించింది.
Comments
Please login to add a commentAdd a comment