హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్న పేసర్ సిద్దార్థ్ కౌల్.. ఇప్పటివరకూ 8 మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లు సాధించాడు. 2008లో విరాట్ కోహ్లి నాయకత్వంలో అండర్-19 ప్రపంచకప్‌లో జట్టులో సభ్యుడిగా ఉన్న కౌల్.. మళ్లీ తప్పకుండా అతని సారథ్యంలోనే భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
‘విరాట్ కోహ్లినే నాకు స్ఫూర్తి. గత పదేళ్లుగా అతడు జట్టులో ఎంతో స్థిరంగా రాణిస్తున్నాడు. నేను త్వరలో టీమిండియాలో చోటు దక్కించుకుంటానన్న నమ్మకం ఉంది. శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం నన్ను ఎంపిక చేశారు. కానీ, ఆడే అవకాశం దక్కలేదు. త్వరలోనే కోహ్లి నాయకత్వంలో నేను భారత్ తరపున కచ‍్చితంగా ఆడతా’ అని సిద్దార్థ్ ధీమా వ్యక్తం చేశాడు. మరొకవైపు ఐపీఎల్ తనకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నాడు. ఐపీఎల్‌లో బౌలింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తున్నట్లు తెలిపాడు.
కొన్ని నెలల క్రితం శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో కౌల్ చోటు దక్కించుకున్నాడు. కానీ, ఒక్క మ్యాచ్‌లో కూడా అతనికి ఆడే అవకాశం దక్కలేదు. కాగా, ఐపీఎల్‌లో తన ప్రదర్శనతో జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమంటున్నాడు కౌల్.
Comments
Please login to add a commentAdd a comment