
సిక్కి రెడ్డి-తరుణ్ జంటకు టైటిల్
రుమేనియా ఇంటర్నేషనల్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తోన్న తెలంగాణ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కి రెడ్డి తన ఖాతాలో మరో టైటిల్‌ను జమ చేసుకుంది. హైదరాబాద్‌కే చెందిన కోనా తరుణ్‌తో కలిసి సిక్కి రెడ్డి రుమేనియా ఇంటర్నేషనల్ సిరీస్‌లో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుం ది. తిమిసోరా పట్టణంలో ఆదివారం జరిగిన ఫైనల్లో సిక్కి రెడ్డి-తరుణ్ ద్వయం 11-7, 11-8, 11-4తో రెండో సీడ్ జోన్స్ రఫ్లీ జాన్సెన్-సిస్టియా జోటీ జాన్సెన్ (జర్మనీ) జంటను ఓడించింది.