సిమ్మన్స్ పై సస్పెన్షన్ వేటు | Simmons suspended as West Indies coach | Sakshi
Sakshi News home page

సిమ్మన్స్ పై సస్పెన్షన్ వేటు

Published Tue, Sep 29 2015 6:59 PM | Last Updated on Sun, Sep 3 2017 10:11 AM

సిమ్మన్స్ పై సస్పెన్షన్ వేటు

సిమ్మన్స్ పై సస్పెన్షన్ వేటు

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: శ్రీలంక పర్యటనలో భాగంగా  వెస్టిండీస్ క్రికెట్ ఆటగాళ్ల ఎంపికపై బహిరంగంగా అసంతృప్తి  వ్యక్తం చేసిన ఆ జట్టు కోచ్ ఫిల్ సిమ్మన్స్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఇటీవల శ్రీలంక టూర్ కు వెస్టిండీస్ క్రికెటర్ల ఎంపికను సిమ్మన్స్ బహిరంగంగా తప్పుబట్టారు. ఇటు ఎలక్ట్రానిక్ మీడియా,  ప్రింట్ మీడియా ముందు ఆటగాళ్ల ఎంపిక సరిగా లేదంటూ సిమ్మన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు.   ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన విండీస్ క్రికెట్ బోర్డు...  ఫిల్ సిమ్మన్స్ ను కోచ్ పదవి నుంచి తప్పిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీలంక టూర్ కు విండీస్ జట్టుతో సిమ్మన్స్ వెళ్లడం లేదని పేర్కొంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి రానున్నట్లు  స్పష్టం చేసింది. 

 

ఈ విషయాన్ని ప్రస్తుతం లండన్ లో ఉన్న సిమ్మన్స్ కు వెస్టిండీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మైఖేల్ ముయిర్ హెడ్ ఈ-మెయిల్ ద్వారా  తెలియజేశారు.కాగా, సిమ్మన్స్ స్థానంలో విండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఎల్డిన్ బాప్టిస్టి తాత్కాలిక కోచ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement