లాంగ్‌జంప్‌లో సోనమ్‌కు స్వర్ణం | Sonam gets Gold Medal in Open Athletics Tourney | Sakshi
Sakshi News home page

లాంగ్‌జంప్‌లో సోనమ్‌కు స్వర్ణం

Published Tue, Sep 11 2018 10:28 AM | Last Updated on Tue, Sep 11 2018 10:28 AM

Sonam gets Gold Medal in Open Athletics Tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఓపెన్‌ స్ప్రింట్స్, జంప్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ అమ్మాయి సోనమ్‌ స్వర్ణంతో మెరిసింది. గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో సోనమ్‌ లాంగ్‌జంప్‌ ఈవెంట్‌లో విజేతగా నిలిచింది. సోమవారం జరిగిన మహిళల లాంగ్‌జంప్‌ ఈవెంట్‌లో సోనమ్‌ అత్యధికంగా 5.13మీ. దూరం జంప్‌ చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అచ్యుత కుమారి (హైదరాబాద్‌) 4.99 మీటర్లు జంప్‌ చేసి రజతాన్ని గెలుచుకోగా... 4.47 మీటర్ల దూరం జంప్‌ చేసిన సింధు (మేడ్చల్‌)కు కాంస్యం దక్కింది. మరోవైపు పురుషుల 400మీ. పరుగులో రిషబ్‌ మిశ్రా (హైదరాబాద్‌) విజేతగా నిలిచాడు. అతను లక్ష్యాన్ని 51.0సెకన్లలో పూర్తి చేసి పసిడి పతకాన్ని అందుకున్నాడు. వరంగల్‌కు చెందిన ఇంద్రసేన్‌ (52.4 సెకన్లు) రజతాన్ని, అభిషేక్‌ (ఎంఎల్‌ఆర్‌ఐటీ) కాంస్యాలను గెలుచుకున్నారు. ఈ పోటీలను సైబరాబాద్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ప్రారంభించారు.  

ఇతర వయోవిభాగాల విజేతల వివరాలు

అండర్‌–10 బాలుర 300 మీ. పరుగు: 1. ఎల్‌. రాము (వరంగల్‌), 2. కె. సాయి ఆనంద్‌ (ఐఈసీఎస్‌), 3. ప్రణయ్‌ (ఏఈసీఎస్‌); బాలికలు: 1. విభా రావు (చిరెక్‌), 2. ఆర్‌. రాగిణి (వరంగల్‌), 3. సంజన (చిరెక్‌).

లాంగ్‌జంప్‌: 1. ఎం. నవదీప్‌ (జీపీఎస్‌టీ), 2. ప్రణవ్‌ (డీపీఎస్‌), 3. కె. అమోఘ్‌ (సారథి).

అండర్‌–12 బాలుర 300మీ. పరుగు: 1. జె. రాఘవ (వరంగల్‌), 2. ఎం. శంకర్‌ (వరంగల్‌), 3. బి. మోహిత్‌కృష్ణ (కొత్త గూడెం); బాలికలు: 1. శరణ్య (ఫోనిక్స్‌), 2. పి. దీప్తి, 3. శ్రేయశ్రీ (ఐఎస్‌).

అండర్‌–14 బాలుర 400మీ. పరుగు: 1. టి. సురేశ్‌ (ఎస్‌డబ్ల్యూ), 2. వి.శ్రీనివాస్‌ (జెడ్పీహెచ్‌ఎస్‌), 3. ఉదయ్‌ కిరణ్‌ (హెచ్‌పీఎస్‌–ఆర్‌); బాలికలు: 1. ఎం. ఇందు (జీహెచ్‌ఎస్‌), 2. సి. వాణి (టీఎస్‌డబ్ల్యూ), 3. యువిక (కెన్నడీ).
అండర్‌–16 బాలుర 400మీ. పరుగు: 1. కె. మహేశ్‌ (వెస్లీ), 2. బి. హరి (వరంగల్‌), 3. నితిన్‌ (రంగారెడ్డి); బాలికల లాంగ్‌జంప్‌: 1. వి. సంధ్య (టీఎస్‌డబ్ల్యూ), 2. రంజిత (టీఎస్‌డబ్ల్యూ), 3. శ్రేయ మీనన్‌ (సెయింట్‌ ఆన్స్‌).  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement