న్యూఢిల్లీ: లాభదాయక జోడు పదవుల్లో కొనసాగుతున్నాడంటూ తనపై వచ్చిన ఆరోపణలకు టీమిండియా మాజీ కెప్టెన్, సౌరభ్ గంగూలీ వివరణ ఇచ్చాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న గంగూలీ ప్రస్తుత ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సలహాదారుగా నియమితుడైన సంగతి తెలిసిందే. ఇలా రెండు లాభదాయక పదవుల్లో ఉండడం చట్ట విరుద్ధమని పేర్కొంటూ ముగ్గురు క్రికెట్ అభిమానులు బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే జైన్‌కు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా గంగూలీకి అంబుడ్స్‌మన్ సంజాయిషీ నోటీసులు పంపింది. దీనిపై వివరణ ఇస్తూ అంబుడ్స్‌మన్‌కు గంగూలీ సుదీర్ఘ లేఖ రాశాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారుగా తాను నిర్వహిస్తున్న బాధ్యత బీసీసీఐ నిబంధనల ప్రకారం ప్రత్యక్ష, పరోక్ష పద్ధతిలోగానీ, వాణిజ్య రీత్యా కానీ లాభదాయక పదవి కాదంటూ ఆ లేఖలో వివరించాడు. ‘ప్రస్తుతం నేను నిర్వహిస్తున్న బాధ్యత బీసీసీఐ అనుబంధ సంఘం/ బీసీసీఐ ఆఫీస్ బేరర్‌లోకి రాదు. అంతేకాదు బీసీసీఐ నిర్వహిస్తున్న క్రికెట్ కమిటీలు/ ఐపీఎల్‌కు సంబంధం లేదు. అయితే, బీసీసీఐ సాంకేతిక కమిటీ, ఐపీఎల్ టెక్నికల్ కమిటీ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో ఒకప్పుడు సభ్యత్వం ఉన్నప్పటికీ ప్రస్తుతం వాటికి రాజీనామా చేశాను. బీసీసీఐ అధీనంలో ఉన్న ఏ కమిటీలోనూ సభ్యున్ని కాదు. అందువల్ల ఢిల్లీ సలహాదారుగా నేను నిర్వహిస్తున్న పోస్ట్ బీసీసీఐ లాభదాయక జోడు పదవుల కిందకురాదు’ అంటూ గంగూలీ ల
Comments
Please login to add a commentAdd a comment