దక్షిణాఫ్రికా శుభారంభం | South Africa Defeated Australia | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా శుభారంభం

Published Mon, Nov 5 2018 3:39 AM | Last Updated on Mon, Nov 5 2018 3:39 AM

South Africa Defeated Australia - Sakshi

పెర్త్‌: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా శుభారంభం చేసింది. ఇరుజట్ల మధ్య ఆదివారం జరిగిన తొలి వన్డేలో డేల్‌ స్టెయిన్‌ (2/18) నిప్పులు చెరగడంతో దక్షిణాప్రికా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ స్టెయిన్‌తో పాటు ఫెలుక్వాయో (3/33), ఇన్‌గిడి (2/26), ఇమ్రాన్‌ తాహిర్‌ (2/39) విజృంభించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 38.1 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. కూల్ట ర్‌నీల్‌ (31 బంతుల్లో 34; 5 ఫోర్లు, సిక్స్‌), అలెక్స్‌ కారీ (33; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు.

అనంతరం సునాయాస లక్ష్య ఛేదనకు బరిలో దిగిన దక్షిణాఫ్రికా ఓపెనర్లు డికాక్‌ (40 బంతుల్లో 47; 7 ఫోర్లు), హెన్‌డ్రిక్స్‌ (44; 4 ఫోర్లు) రాణించడంతో 29.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసి గెలిచింది. వన్డేల్లో ఆస్ట్రేలియా జట్టుకిది వరుసగా ఏడో ఓటమి కావడం గమనార్హం. 1996లో సెప్టెంబర్‌ 7 నుంచి నవంబర్‌ 3 మధ్యకాలంలో ఆస్ట్రేలియా వరుసగా ఆరు వన్డేల్లో ఓడింది. ఆ తర్వాత ఆ జట్టుకు అత్యధిక వరుస ఓటములు ఎదురుకావడం ఇదే తొలిసారి. రెండో వన్డే శుక్రవారం అడిలైడ్‌లో జరుగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement