దక్షిణాఫ్రికాతో తొలివన్డే: భారత్ విజయలక్ష్యం 359
జోహన్స్బర్గ్:భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 359 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన టీమిండియా సఫారీలను బ్యాటింగ్కు ఆహ్వానించింది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ను ఆరంభించిన ఓపెనర్లు ఆషిమ్ ఆమ్లా, డి కాక్ లు జట్టుకు శుభారంభాన్నిచ్చారు. ఆమ్లా(65) పరుగులతో ఆకట్టుకోగా, డి కాక్(135)పరుగులు చేసి భారత్ బౌలర్లకు సవాల్ గా నిలిచారు.వీరివురూ అవుటైన తరువాత స్కోరు మందగిస్తుందని భావించిన భారత్ కు డివిలియర్స్ అడ్డుగోడలా నిలిచాడు. డివిలియర్స్(77) పరుగులతో బ్యాట్ ఝుళిపించగా, అతనికి అండగా డుమినీ(59) పరుగులు చేశాడు.
దీంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 358 పరుగుల భారీ స్కోరు చేసింది. విదేశీ గడ్డలపై పేలవంగా ప్రదర్శన మూటగట్టుకునే బౌలర్లు మరోసారి విఫలమైయ్యారు. భారత్ బౌలర్లలో మహ్మమద్ షమీకి మూడు వికెట్లు లభించగా, కోహ్లికి ఒక వికెట్టు దక్కింది.