దక్షిణాఫ్రికాదే రెండో టెస్టు
దుబాయ్: సిరీస్‌ను డ్రా చేసుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు చెలరేగారు. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో అదరగొడుతూ పాక్ జట్టుకు కళ్లెం వేశారు. దీంతో ఇరుజట్ల మధ్య నాలుగు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో స్మిత్‌సేన ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో మిస్బాసేనపై విజయం సాధించింది.
దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో డ్రా అయ్యింది. 132/4 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఆట కొనసాగించిన పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 135.1 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది.
అసద్ షఫీక్ (130) సెంచరీ చేసినా ప్రయోజనం లేకపోయింది. మిస్బా (88) రాణించాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 197 పరుగులు జోడించారు. లోయర్ ఆర్డర్ విఫలం కావడంతో పాక్ 59 పరుగుల తేడాతో చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. తాహిర్, డుమిని చెరో మూడు వికెట్లు తీశారు. స్టెయిన్, ఫిలాండర్, ఎల్గర్‌కు ఒక్కో వికెట్ దక్కింది. స్మిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’; డివిలియర్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
డుప్లెసిస్‌కు జరిమానా
రెండో టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ ఫాఫ్ డుప్లెసిస్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. ఐసీసీ క్రమశిక్షణ నియమావళిలోని ఆర్టికల్ 2.2.9ని అతను ఉల్లంఘించినట్లు తేల్చారు. మూడో రోజు ఆట సందర్భంగా డుప్లెసిస్ బంతిని తన ట్రౌజర్‌కున్న జిప్ మీద బలంగా రుద్దిన సంగతి తెలిసిందే.