స్పోర్ట్స్ క్యాలెండర్ | sports calender 2016 | Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్ క్యాలెండర్

Published Fri, Jan 1 2016 1:27 AM | Last Updated on Sun, Sep 3 2017 2:53 PM

స్పోర్ట్స్ క్యాలెండర్

స్పోర్ట్స్ క్యాలెండర్

అనేక మధుర జ్ఞాపకాలను మిగిల్చిన 2015 కాలగర్భంలో కలిసిపోయింది. కొత్త ఆశలు, కాంతుల మధ్య 2016 వచ్చేసింది. ఈ ఏడాది మొత్తం క్రీడాభిమానులకు పెద్ద పండగ. ప్రతి క్రీడాకారుడు జీవితంలో ఒక్కసారైనా పాల్గొనాలని కలలుగనే ఒలింపిక్స్ ఈ ఏడాది జరగబోతున్నాయి. నాలుగేళ్లకోసారి జరిగే ఈ క్రీడాసంరంభానికి ఈ సారి బ్రెజిల్ వేదిక కానుంది.
 
  ఇక క్రికెట్ విషయానికొస్తే భారత్‌లో ఈసారి టి20 ప్రపంచకప్ జరగబోతోంది. ఫార్ములావన్, బ్యాడ్మింటన్, టెన్నిస్ టోర్నీలు... ఇలా ప్రతి ఏడాదీ జరిగే టోర్నీలు ఎలాగూ ఉన్నాయి. మొత్తం మీద ఈ ఏడాది మొత్తం క్రీడల సందడి. అభిమానులకు కావలసినంత వినోదం. 2016లో ముఖ్యమైన క్రీడలకు సంబంధించి సాక్షి క్రీడావిభాగం అందిస్తున్న క్యాలెండర్.

 ఒలింపిక్స్ క్రీడలు-2016:   ఆగస్టు 5 నుంచి 21 వరకు
 వేదిక: రియో డి జనీరో, బ్రెజిల్ ; 28 క్రీడాంశాల్లో 306 ఈవెంట్స్

 
 

 

 



 

క్రికెట్
 జనవరి 12-23: భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఐదు వన్డేల సిరీస్ (ఆస్ట్రేలియాలో)
 జనవరి 26-31: భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడు టి20ల సిరీస్ (ఆస్ట్రేలియాలో)
 ఫిబ్రవరి: భారత్, శ్రీలంక మధ్య మూడు టి20 మ్యాచ్‌లు (విశాఖపట్నం, పుణే, న్యూఢిల్లీ)
 ఫిబ్రవరి 24-మార్చి 6: బంగ్లాదేశ్‌లో ఆసియా కప్ టి20 టోర్నీ (భారత్, పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్, క్వాలిఫయర్)
 మార్చి 8-ఏప్రిల్ 3: ఐసీసీ టి20 వరల్డ్ కప్ టోర్నీ (భారత్‌లో)
 ఏప్రిల్ 9-మే 29: ఐపీఎల్-2016 టి20 టోర్నీ (భారత్‌లో)
 జూన్: జింబాబ్వేలో భారత్ పర్యటన (ఒక టెస్టు, మూడు వన్డేలు)
 జులై, ఆగస్టు: భారత్‌లో వెస్టిండీస్ పర్యటన (నాలుగు టెస్టులు)
 ఆగస్టు:  భారత్‌లో బంగ్లాదేశ్ పర్యటన (ఒక టెస్టు)
 అక్టోబరు: భారత్‌లో న్యూజిలాండ్ పర్యటన (మూడు టెస్టులు, ఐదు వన్డేలు)
 నవంబరు-డిసెంబరు: భారత్‌లో
 ఇంగ్లండ్ పర్యటన (ఐదు టెస్టులు)

 

 

 


 
 టెన్నిస్
 జనవరి 4-10: చెన్నై ఓపెన్ టోర్నీ
 జనవరి 18-31: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ
 మార్చి 7-20: ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ
 మార్చి 31-ఏప్రిల్ 3: మియామి మాస్టర్స్ సిరీస్ టోర్నీ
 ఏప్రిల్ 10-17: మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నీ
 మే 1-8: మాడ్రిడ్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ
 మే 8-15: రోమ్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ
 మే 22-జూన్ 5: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ
 జూన్ 27-జులై 10: వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ
 జులై 25-31: రోజర్స్ కప్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ
 ఆగస్టు 15-21: సిన్సినాటి మాస్టర్స్ సిరీస్ టోర్నీ
 ఆగస్టు 29-సెప్టెంబరు 11: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ
 అక్టోబరు 10-16: షాంఘై మాస్టర్స్ సిరీస్ టోర్నీ
 అక్టోబరు 31-నవంబరు 6: పారిస్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ
 నవంబరు 14-20: ఏటీపీ వరల్డ్ టూర్  ఫెనల్స్ టోర్నీ
 

 

 

 



 ఫుట్‌బాల్
 మే 28: చాంపియన్స్ లీగ్ ఫైనల్ (మిలాన్, ఇటలీ)
 జూన్ 3-26: కోపా అమెరికా కప్ (అమెరికా)
 జూన్ 10-జులై 10: యూరో కప్ (ఫ్రాన్స్)
 సెప్టెంబరు 30-అక్టోబరు 17: మహిళల అండర్-17 ప్రపంచ కప్ (జోర్డాన్)
 నవంబరు 13-డిసెంబరు 3: మహిళల అండర్-20 ప్రపంచ కప్ (పాపువా న్యూ గినియా)

 

 

 



 ఫార్ములావన్
 మార్చి 20: ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి
 ఏప్రిల్ 3: బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి
 ఏప్రిల్ 17: షాంఘై గ్రాండ్‌ప్రి
 మే 1: రష్యా గ్రాండ్‌ప్రి
 మే 15: స్పెయిన్ గ్రాండ్‌ప్రి
 మే 29: మొనాకో గ్రాండ్‌ప్రి
 జూన్ 12: కెనడా గ్రాండ్‌ప్రి
 జూన్ 19: అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రి
 జులై 3: ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి
 జులై 10: బ్రిటిష్ గ్రాండ్‌ప్రి
 జులై 24: హంగేరి గ్రాండ్‌ప్రి
 జులై 31: జర్మనీ గ్రాండ్‌ప్రి
 ఆగస్టు 28: బెల్జియం గ్రాండ్‌ప్రి
 సెప్టెంబరు 4: ఇటలీ గ్రాండ్‌ప్రి
 సెప్టెంబరు 18: సింగపూర్ గ్రాండ్‌ప్రి
 అక్టోబరు 2: మలేసియా గ్రాండ్‌ప్రి
 అక్టోబరు 9: జపాన్ గ్రాండ్‌ప్రి
 అక్టోబరు 23: యూఎస్ గ్రాండ్‌ప్రి
 అక్టోబరు 30: మెక్సికో గ్రాండ్‌ప్రి
 నవంబరు 13: బ్రెజిల్ గ్రాండ్‌ప్రి
 నవంబరు 27: అబుదాబి గ్రాండ్‌ప్రి
 

 

 

 



 షూటింగ్
 జనవరి 25-ఫిబ్రవరి 3: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ (న్యూఢిల్లీ)
 మార్చి 1-9: వరల్డ్ కప్ రైఫిల్, పిస్టల్ టోర్నీ (బ్యాంకాక్)
 మార్చి 17-25: వరల్డ్ కప్ షాట్‌గన్ టోర్నీ  (సైప్రస్)
 ఏప్రిల్ 13-25: వరల్డ్ కప్ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ టోర్నీ (రియో డి జనీరో, బ్రెజిల్)
 మే 19-26: వరల్డ్ కప్ రైఫిల్, పిస్టల్ టోర్నీ (మ్యూనిచ్, జర్మనీ)
 జూన్ 1-11: వరల్డ్ కప్ షాట్‌గన్ టోర్నీ (శాన్ మరీనో)
 జూన్ 20-29: వరల్డ్ కప్ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ టోర్నీ (బాకు, అజర్‌బైజాన్)
 అక్టోబరు 4-10: వరల్డ్ కప్ ఫైనల్స్ రైఫిల్, పిస్టల్ టోర్నీ (బొలోగ్నా, ఇటలీ)
 అక్టోబరు 11-16: వరల్డ్ కప్ ఫైనల్స్ షాట్‌గన్ టోర్నీ (రోమ్, ఇటలీ)
 

 

 

 



 వెయిట్‌లిఫ్టింగ్
 ఏప్రిల్ 25-30: ఆసియా చాంపియన్‌షిప్, ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ (సమర్‌కండ్, ఉజ్బెకిస్తాన్)
 జూన్ 24-జులై 2: జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్ (జార్జియా)
 అక్టోబరు 20-25: యూత్ ప్రపంచ చాంపియన్‌షిప్ (మలేసియా)
 అక్టోబరు 25-29: కామన్వెల్త్ యూత్, జూనియర్, సీనియర్ చాంపియన్‌షిప్ (మలేసియా)
 నవంబరు 8-16: ఆసియా యూత్, జూనియర్ చాంపియన్‌షిప్ (జపాన్)
 








 బాక్సింగ్

 మార్చి 23-ఏప్రిల్ 3: ఆసియా, ఓసియానియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ (కియానాన్, చైనా)
 మే 19-27: ప్రపంచ మహిళల చాంపియన్‌షిప్ (అస్తానా, కజకిస్తాన్)
 జూన్ 7-19: ప్రపంచ ఒలింపిక్ ఫైనల్ క్వాలిఫయింగ్ టోర్నీ (బాకు, అజర్‌బైజాన్)
 అక్టోబరు 24-నవంబరు 6: ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్ (రష్యా)
 

 

 

 



 ఆర్చరీ
 ఏప్రిల్ 26-మే 1: వరల్డ్ కప్ స్టేజ్-1 (షాంఘై, చైనా)
 మే 10-15: వరల్డ్ కప్ స్టేజ్-2 (మెడిలియన్, కొలంబియా)
 జూన్12-19: వరల్డ్ కప్ స్టేజ్-3(అంటాల్యా, టర్కీ)

 

 

 



 రెజ్లింగ్
 జనవరి 27-30: డేవ్ షుల్జ్ స్మారక టోర్నీ (కొలరాడో స్ప్రింగ్స్, అమెరికా)
 ఫిబ్రవరి 17-21: ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్ (బ్యాంకాక్)
 మార్చి 18-20: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ
 ఏప్రిల్ 22-24: ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ-1 (ఉలాన్‌బాటర్, మంగోలియా)
 మే 6-8: ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ-2 (ఇస్తాంబుల్, టర్కీ)
 








 కబడ్డీ
 జనవరి 30-మార్చి 6: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-3
 జులై-ఆగస్టు: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-4









 
 బ్యాడ్మింటన్
 జనవరి 2-17: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (భారత్)
 జనవరి 19-24: మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ (పెనాంగ్)
 జనవరి 26-31: సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ (లక్నో)
 ఫిబ్రవరి 15-21: ఆసియా టీమ్ చాంపియన్‌షిప్ (హైదరాబాద్)
 మార్చి 8-13: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ (బర్మింగ్‌హామ్)
 మార్చి 15-20: స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ (బాసెల్)
 మార్చి 29-ఏప్రిల్ 3: ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (న్యూఢిల్లీ)
 ఏప్రిల్ 5-10: మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ (షా ఆలమ్)
 ఏప్రిల్ 12-17: సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (సింగపూర్ సిటీ)
 ఏప్రిల్ 26-మే 1: ఆసియా వ్యక్తిగత చాంపియన్‌షిప్ (వుహాన్, చైనా)
 మే 15-22: థామస్ కప్, ఉబెర్ కప్ ఫైనల్స్ (కున్‌షన్, చైనా)
 మే 30-జూన్ 5: ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ (జకార్తా)
 జూన్ 7-12: ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (సిడ్నీ)
 సెప్టెంబరు 20-25: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (టోక్యో)
 సెప్టెంబరు 27-అక్టోబరు 2: కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (సియోల్)
 అక్టోబరు 18-23: డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ (ఒడెన్స్)
 అక్టోబరు 25-30: ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (పారిస్)
 నవంబరు 15-20: చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ (ఫుజౌ)
 నవంబరు 22-27: హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ (కౌలూన్)
 నవంబరు 22-27: ఇండియా ఇంటర్నేషనల్ సిరీస్ టోర్నీ (హైదరాబాద్)
 నవంబరు 29-డిసెంబరు 4: మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ
 డిసెంబరు 1-4: టాటా ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీ (ముంబై)
 డిసెంబరు 14-18: వరల్డ్ సూపర్ సిరీస్ టోర్నీ ఫైనల్స్ (దుబాయ్)
 








 హాకీ
 జనవరి 18-ఫిబ్రవరి 21: హాకీ ఇండియా లీగ్
 జూన్ 11-19: పురుషుల చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ (అర్జెంటీనా)
 జూన్ 18-26: మహిళల చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ (లండన్)
 అక్టోబరు 1-15: ఆసియా మహిళల చాంపియన్స్ ట్రోఫీ
 నవంబరు 1-15: ఆసియా పురుషుల చాంపియన్స్ ట్రోఫీ (భారత్)
 నవంబరు 24-డిసెంబరు 4: జూనియర్ మహిళల ప్రపంచ కప్ (చిలీ)
 డిసెంబరు 1-11: జూనియర్ పురుషుల ప్రపంచ కప్ (భారత్)
 








 అథ్లెటిక్స్
 మార్చి 17-20: ప్రపంచ ఇండోర్ చాంపియన్‌షిప్(అమెరికా)
 మార్చి 20: ఆసియా 20 కి.మీ.  రేస్ వాకింగ్ చాంపియన్‌షిప్ (జపాన్)
 ఏప్రిల్ 18: బోస్టన్ మారథాన్
 ఏప్రిల్ 24: లండన్ మారథాన్
 మే 6: డైమండ్ లీగ్ మీట్-1 (దోహా)
 మే 14: డైమండ్ లీగ్ మీట్-2 (షాంఘై)
 మే 28: డైమండ్ లీగ్ మీట్-3 (అమెరికా)
 జూన్ 2: డైమండ్ లీగ్ మీట్-4 (రోమ్)
 జూన్ 5: డైమండ్ లీగ్ మీట్-5 (బర్మింగ్‌హామ్)
 జూన్ 9: డైమండ్ లీగ్ మీట్-6 (నార్వే)
 జూన్ 16: డైమండ్ లీగ్ మీట్-7 (స్వీడన్)
 జూన్ 18: డైమండ్ లీగ్ మీట్-8 (అమెరికా)
 జులై 15: డైమండ్ లీగ్ మీట్-9 (మొనాకో)
 జులై 22-23: డైమండ్ లీగ్ మీట్-10 (లండన్)
 ఆగస్టు 25: డైమండ్ లీగ్ మీట్-11 (స్విట్జర్లాండ్)
 ఆగస్టు 27: డైమండ్ లీగ్ మీట్-12 (పారిస్)
 సెప్టెంబరు 1: డైమండ్ లీగ్ మీట్-13 (జ్యూరిచ్)
 సెప్టెంబరు 9: డైమండ్ లీగ్ మీట్-14 (బెల్జియం)
 








 చెస్
 ఫిబ్రవరి 10-24: ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్ టోర్నీ (కిష్, ఇరాన్)
 మార్చి 1-19: ప్రపంచ మహిళల వ్యక్తిగత చాంపియన్‌షిప్ మ్యాచ్ (మరియా ముజిచుక్-హూ ఇఫాన్; ఎల్‌వివ్, ఉక్రెయిన్)
 మార్చి 10-30: పురుషుల క్యాండిడేట్స్ టోర్నమెంట్ (మాస్కో, రష్యా)
 మార్చి 27-ఏప్రిల్ 8: ఆసియా నేషన్స్ కప్ (అబుదాబి, యూఏఈ)
 ఏప్రిల్ 20-మే 4: ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్ టోర్నీ (టిబిలిసి, జార్జియా)
 మే 25-జూన్ 5: ఆసియా వ్యక్తిగత చాంపియన్‌షిప్ (తాష్కెంట్)
 జులై 1-15: ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్ టోర్నీ (చెంగ్డూ, చైనా)
 జులై 21-30: ప్రపంచ యూత్ అండర్-16 ఒలింపియాడ్ (స్లొవేకియా)
 ఆగస్టు 7-21: ప్రపంచ జూనియర్ అండర్-20 బాలికల టోర్నీ (ఒడిషా)
 సెప్టెంబరు 17-30: ప్రపంచ చెస్ ఒలింపియాడ్ (బాకు, అజర్‌బైజాన్)
 అక్టోబరు11-31: ప్రపంచ మహిళల చాంపియన్‌షిప్
 








 టేబుల్ టెన్నిస్
 జనవరి 22-24: ప్రపంచ జూనియర్ సర్క్యూట్ ఫైనల్స్ (ఇండోర్)
 ఫిబ్రవరి 28-మార్చి 6: ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్ (మలేసియా)
 ఏప్రిల్ 13-17: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ (హాంకాంగ్)
 ఏప్రిల్ 28-30: ఆసియా కప్ (దుబాయ్)
 మే 28-జూన్ 12: ఇండియన్ టేబుల్ టెన్నిస్ లీగ్ (భారత్)
 సెప్టెంబరు 7-11: ఇండియా జూనియర్ ఓపెన్ టోర్నీ (ఇండోర్)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement