కొలంబో: కాస్త ఆలస్యంగానైనా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పరిపాలనా పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనలకు శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) అంగీకారం తెలిపింది. ఈనెల 8న సింగపూర్‌లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో వీటికి ఎస్‌ఎల్‌సీ సమ్మతించక ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. తమ అభిప్రాయం తెలిపేందుకు కొంత సమయం కావాలని కోరింది. అయితే సవరించిన ప్రతిపాదనలపై తాము సంతృప్తిగా ఉన్నామని లంక బోర్డు తెలిపింది.
‘సోమవారం జరిగిన ఎస్‌ఎల్‌సీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఐసీసీ ప్రతిపాదనలపై సభ్యుల మధ్య చర్చ జరిగింది. సవరించిన పరిపాలన, షెడ్యూల్ పద్ధతిని ఏకగ్రీవంగా ఆమోదించాలని నిర్ణయం తీసుకున్నాం’ అని ఎస్‌ఎల్‌సీ తెలిపింది. వచ్చే ఏడేళ్లలో భారత, ఆసీస్, ఇంగ్లండ్‌లతో సిరీస్‌ల కారణంగా తమకు 48 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని కార్యదర్శి నిశాంత రణతుంగ అన్నారు.
‘కొత్త’ ఐసీసీకి లంక బోర్డు సమ్మతం
Published Wed, Feb 19 2014 12:56 AM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM
Advertisement