హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) గ్రేడ్-5 జూనియర్స్ వియత్నాం ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ శ్రీవత్స రాచకొండ డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచాడు. భారత్‌కే చెందిన సిద్ధార్థ్ ఠక్రాన్తో కలిసి శ్రీవత్స ఈ టోర్నీలో ఆడాడు.
డబుల్స్ ఫైనల్లో యు సియంగ్ సు (చైనీస్ తైపీ)-చింగ్ హో (హాంకాంగ్) జోడీ 6-3, 6-3తో శ్రీవత్స-సిద్ధార్థ్ జంటపై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో శ్రీవత్స- సిద్ధార్థ్ జోడీ 7-6(10/8), 6-2తో చ్యువ్-డేనిల్ స్పాసిబో (రష్యా) జంటపై నెగ్గి ఫైనల్‌కు చేరుకుంది.