సాక్షి, సిటీబ్యూరో: రైఫిల్ షూటింగ్‌లో ఖమ్మం బాలిక కొండపల్లి శ్రీయారెడ్డి ఉత్తమ ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గచ్చిబౌలి స్టేడియంలో శిక్షణ పొందిన శ్రీయ ఇప్పటికే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ పోటీల్లో కాంస్య పతకం సాధించింది. భోపాల్‌లో ఈ నెల 19 నుంచి జనవరి 4 వరకు జరుగుతున్న జాతీయ జూనియర్ రైఫిల్ షూటింగ్‌లో తెలంగాణ తరపున ప్రాతినిథ్యం వహిస్తూ ఉత్తమ ప్రతిభను కనబరుస్తున్నారు. ఈ పోటీల్లో ఇప్పటి వరకు సీనియర్ల పాయింట్ల కన్నా అధికంగా సాధించింది. మొత్తం 587 పాయింట్లకు గానూ, ఏకంగా 604.6 పాయింట్లు సాధించింది. సీనియర్ కేటగిరీల్లో సాధించే పాయింట్లు సాధించడంతో భారత తుది జట్టుకు ఎంపిక చేసే అర్హత ఎంపికలకు శ్రీయారెడ్డి ఎంపికైంది.
భారత జట్టులో చోటు దక్కుతుంది
భారత జట్టులో స్థానం సాధిస్తుందని శ్రీయారెడ్డి ప్రత్యేక శిక్షకుడు మేడి షణ్ముగం ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే క్వాలిఫై ట్రయల్స్ జనవరి చివరి వారంలో ఉంటాయని చెప్పారు.– శ్రీయారెడ్డి శిక్షకుడు మేడి షణ్ముగం
తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే..
నా తల్లిదండ్రులు చైతన్య, రవీందర్‌రెడ్డి ప్రోత్సాహం వల్లే జాతీయస్థాయిలో ప్రతిభ చాటుతునున్నాను. నా పాఠశాల యాజమాన్యం కూడా అన్ని విధాలా సహకరిస్తోంది. – కొండపల్లి శ్రీయారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment