కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు అనుకూలం  | Suitable for Kolkata Knightriders - Sunil Gavaskar | Sakshi
Sakshi News home page

కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు అనుకూలం 

Published Sun, May 5 2019 1:09 AM | Last Updated on Sun, May 5 2019 1:09 AM

Suitable for Kolkata Knightriders - Sunil Gavaskar - Sakshi

ఐపీఎల్‌లో చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడబోతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు అనుకూలాంశం ఉంది. ప్లే ఆఫ్‌ బెర్త్‌ దక్కించుకోవడానికి కేవలం విజయం సాధిస్తే సరిపోతుందా? లేక ఎన్ని ఓవర్లలో లక్ష్య ఛేదన చేయాలి, ఎన్ని పరుగుల తేడాతో గెలవాలి అన్న విషయంపై కోల్‌కతా జట్టుకు స్పష్టత వస్తుంది. పంజాబ్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అద్భుతంగా నెగ్గింది. ముఖ్యంగా శుబ్‌మన్‌ గిల్‌ మరోసారి తన సత్తా చాటుకున్నాడు. ఈ గెలుపుతో కోల్‌కతా జట్టు ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగి ఉంటుంది. గతవారం ఈడెన్‌ గార్డెన్స్‌లో ముంబై ఇండియన్స్‌పై 200 పరుగుల భారీ స్కోరు చేసి విజయం సాధించిన కోల్‌కతా మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ఆ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా ముంబై జట్టును గట్టెక్కించడానికి తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యాడు.

అయితే సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌లో హార్దిక్‌ తన జట్టును గెలిపించాడు. మరోవైపు చెన్నై సూపర్‌ కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన తమ చివరి మ్యాచ్‌లో గెలిచి లీగ్‌ దశను టాప్‌ ర్యాంక్‌తో ముగించాలనే పట్టుదలతో ఉంది. ఐపీఎల్‌ను విజయంతో ముగించాలని పంజాబ్‌ ఆశిస్తోంది. పంజాబ్‌కు ప్లే ఆఫ్‌ అవకాశాలు లేకపోవడంతో క్రిస్‌ గేల్, లోకేశ్‌ రాహుల్‌ విధ్వంసకర ఆటతో ప్రేక్షకులను అలరిస్తారేమో చూడాలి. ఈ ఇద్దరితోపాటు ధోని ఆటను కూడా ఆస్వాదించాలని పంజాబ్‌ ప్రేక్షకులు మైదానానికి వస్తారనడంలో సందేహం లేదు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement