2011 ప్రపంచకప్ చాంపియన్స్ (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : భారత క్రికెట్ అభిమానులకు ఎంతో ముఖ్యమైనది ఈ రోజు.. సరిగ్గా ఏడేళ్ల కిందట ఇదే రోజున టీమిండియా కెప్టెన్‌గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని కొట్టిన విన్నింగ్ షాట్‌ను ఎవరూ మరిచిపోలేరు. ఎందుకంటే అది భారత జట్టుకు వన్డే ప్రపంచ కప్‌ను అందించిన మధురక్షణం.
2011 ఏప్రిల్ 2న ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై విజయం సాధించి భారత్ 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధుర క్షణం అభిమానులకే ప్రత్యేకమైతే.. ఆ నాటి జట్టులో ఉన్న ఆటగాళ్లకు ఎంత ప్రత్యేకమో చెప్పనక్కర్లేదు. ఈ అంశాన్నే ప్రస్తావిస్తూ పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు ఆ అనుభూతిని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు.
నా జీవితంలోనే ఇదో గొప్ప సందర్భం. ఏడేళ్ల క్రితం ఎంతో మంది ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. అదో అద్భుత రాత్రి. ఆ రోజు రాత్రి మా విజయం అపూర్వం- వీరేంద్ర సెహ్వాగ్
2011 ప్రపంచకప్ విజేత భారత్. నా జీవితంలో ఓ అద్భుతమైన రోజు. మాపై ప్రేమ కురిపించి, మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు- హర్భజన్ సింగ్
ఏడేళ్ల క్రితం 15మంది భారతీయులు, దక్షిణాఫ్రికాకు చెందిన ఒకరు(అప్పుటి టీమిండియా కోచ్ దక్షిణాఫ్రికాకు చెందిన గ్యారీ కిర్‌స్టన్) కొన్ని కోట్లమంది హృదయాలను గెలుచుకున్నారు- సురేశ్ రైనా
ఈ జనరేషన్ క్రికెట్ అభిమానులకు ఇది ఓ అద్భుత ఘట్టం. ఏడేళ్ల క్రితం ఓ రాత్రి గంభీర్, ధోనిలు కీర్తిని తెచ్చిపెట్టారు. అదే రాత్రి 22 ఏళ్లు ఎదురు చూసిన సచిన్ పాజీ చేతుల్లో ప్రపంచకప్‌ను చూడటం ఎప్పటికీ మరచిపోలేం- మహ్మద్ కైఫ్
2011 ఏప్రిల్ 2న భారత్ ప్రపంచకప్ గెలిచింది. ధోనీ కొట్టిన సిక్స్ మరిచిపోలేము. ఈ మూమెంట్‌ను ఎవరు మాత్రం మరిచిపోగలరు చెప్పండి: ఐసీసీ
Comments
Please login to add a commentAdd a comment