భారత్ క్లీన్‌స్వీప్ | Sweep | Sakshi
Sakshi News home page

భారత్ క్లీన్‌స్వీప్

Published Fri, Mar 14 2014 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 4:40 AM

భారత్ క్లీన్‌స్వీప్

భారత్ క్లీన్‌స్వీప్

టి20 ప్రపంచ కప్‌కు ముందు భారత మహిళల జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచే విజయాన్ని సాధించింది.

కాక్స్‌బజార్: టి20 ప్రపంచ కప్‌కు ముందు భారత మహిళల జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచే విజయాన్ని సాధించింది. ఆతిథ్య బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-0తో సొంతం చేసుకుంది. గురువారం ఇక్కడ జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది.

ముందుగా బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 81 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్రవంతి (3/13), గౌహర్ (3/17) ప్రత్యర్థిని కట్టిపడేశారు. కెప్టెన్ సల్మాన్ ఖాతూన్ (34; 1 ఫోర్), ఆయేషా (32 బంతుల్లో 18; 1 ఫోర్) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. అనంతరం భారత్ 16.4 ఓవర్లలో 2 వికెట్లకు 82 పరుగులు చేసి విజయాన్నందుకుంది. లతికా (47 బంతుల్లో 36; 3 ఫోర్లు), శిఖా పాండే (35 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు) జట్టును గెలిపించారు.

‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు స్రవంతికే దక్కింది. టి20 ప్రపంచ కప్‌లో భాగంగా భారత జట్టు ఈ నెల 24న జరిగే తమ తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement