సురబాయ (ఇండోనేసియా): ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ అండర్–15 బాలికల సింగిల్స్ విభాగంలో భారత అమ్మాయి తస్నిమ్ మీర్ విజేతగా అవతరించింది. భారత్‌కే చెందిన తారా షాతో ఆదివారం జరిగిన ఫైనల్లో తస్నిమ్ మీర్ 17–21, 21–11, 21–19తో విజయం సాధించింది. గుజరాత్‌కు చెందిన 13 ఏళ్ల తస్నిమ్ తన తల్లితో కలిసి 2017లో హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో చేరి ఆయన వద్దే శిక్షణ తీసుకుంటోంది.
తస్నిమ్ తండ్రి ఇర్ఫాన్ అలీ గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ఖేలో ఇండియా గేమ్స్‌లో అండర్–17 సింగిల్స్ విభాగంలో స్వర్ణం నెగ్గిన తస్నిమ్ గతేడాది ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి మేఘన రెడ్డితో కలిసి అండర్–15 డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment