
రాస్ టేలర్
డూడెన్ : ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య జరిగిన నాలుగో వన్డేలో కివీస్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్(181) అద్భుత సెంచరీతో కదం తొక్కాడు. దీంతో ఇంగ్లండ్‌పై కివీస్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 335 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో బెయిర్ స్టో (132), రూట్(102)లు సెంచరీలతో రాణించారు.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు ఇద్దరు డకౌట్‌గా పెవిలియన్ చేరారు. తర్వాత క్రీజులోకి వచ్చిన రాస్ టేలర్, లాథమ్‌లు చెలరేగి ఆడటంతో హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్ చివరకు కివిస్ వశమైంది. ఈ విజయంతో సిరీస్ 2-2 తో సమమైంది. చివరి వన్డే శక్రవారం జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment