► దులీప్‌లో జోనల్ పద్ధతికి స్వస్తి
► బీసీసీఐ సాంకేతిక కమిటీ నిర్ణయం
బెంగళూరు: వచ్చే సీజన్ నుంచి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లను తటస్థ వేదికలపై జరిపేందుకు బీసీసీఐ సాంకేతిక కమిటీ నిర్ణయం తీసుకుంది. అలాగే దులీప్ ట్రోఫీలో కొనసాగుతున్న ఇంటర్ జోనల్ పద్ధతికి స్వస్తి పలకనున్నారు. దీని స్థానంలో సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన నాలుగు ఆలిండియా స్థాయి జట్లను ఆడించనున్నారు.సౌరవ్ గంగూలీ నేతృత్వంలో జరిగిన సాంకేతిక కమిటీ సమావేశంలో బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కే కూడా పాల్గొన్నారు.
దేశవాళీ క్రికెట్‌లో మరింత పోటీతత్వం పెంచాలనే ఉద్దేశంతో తటస్థ వేదికల నిర్ణయం తీసుకున్నట్టు కమిటీ పేర్కొంది. ఇక 2016-17 దులీప్ ట్రోఫీ సీజన్‌లో రౌండ్ రాబిన్ పద్ధతిలో తలపడేందుకు నాలుగు జట్లను సెలక్షన్ కమిటీ నిర్ణయిస్తుంది. అలాగే మొత్తం టోర్నీ డే అండ్ నైట్‌లో జరుగుతుంది. స్టార్ ఆటగాళ్లతో పాటు టెస్టు జట్టులో చోటును ఆశిస్తున్న వారికి కూడా ఫ్లడ్‌లైట్ల వెలుతురులో గులాబి బంతితో ఆడే అవకాశం దక ్కనుందని కమిటీ సభ్యులొకరు తెలిపారు. ఈ ప్రతిపాదనలను బోర్డు వర్కింగ్ కమిటీ ముందుంచనున్నారు.
తటస్థ వేదికల్లో రంజీ ట్రోఫీ
Published Mon, May 30 2016 3:14 AM | Last Updated on Mon, Sep 4 2017 1:12 AM
Advertisement