
సాక్షి, హైదరాబాద్: మినీ సబ్ జూనియర్ అండర్–12 జాతీయ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలబాలికల జట్లు ఆకట్టుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో బాలికల జట్టు విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకోగా... బాలుర జట్టు రన్నరప్ ట్రోఫీని అందుకుంది. మంగళవారం జరిగిన బాలికల ఫైనల్లో తెలంగాణ 4–0తో రాజస్తాన్‌పై ఘనవిజయం సాధించింది. మధ్యప్రదేశ్ జట్టుకు మూడో స్థానం దక్కింది.
మరోవైపు బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో తెలంగాణ 2–9తో ఆంధ్రప్రదేశ్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. బాలుర విభాగంలోనూ మధ్యప్రదేశ్ జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ యువజన, క్రీడా శాఖ డైరెక్టర్ సుమన్ రావత్ మెహతా ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment