
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ పురుషుల జట్టు ముందంజ వేసింది. ఆంధ్రప్రదేశ్ వేదికగా మంగళవారం జరిగిన పురుషుల తొలి మ్యాచ్‌లో తెలంగాణ 8–3తో బిహార్‌పై విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో ఢిల్లీ 3–1తో ఆంధ్రప్రదేశ్‌ను ఓడించగా... ఛత్తీస్‌గఢ్ 2–0తో కేరళపై, మహారాష్ట్ర 12–0తో పాండిచ్చేరిపై గెలుపొందాయి. మహిళల విభాగంలో మహారాష్ట్ర 8–0తో రాజస్తాన్‌పై, చండీగఢ్ 4–3తో ఆంధ్రప్రదేశ్‌పై, కేరళ 10–0తో పాండిచ్చేరిపై నెగ్గి ముందంజ వేశాయి.
Comments
Please login to add a commentAdd a comment