సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మినీ సబ్ జూనియర్ (అండర్–13) సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. నిర్మల్‌లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమైన ఈ టోర్నీలో బాలుర జట్టు గెలుపొందగా, బాలికల జట్టు తొలి మ్యాచ్‌లోనే పరాజయం పాలైంది. బాలుర కేటగిరీలో హైదరాబాద్ 12–0తో మేడ్చల్‌పై నెగ్గగా... బాలికల జట్టు 0–8తో రంగారెడ్డి చేతిలో ఓడిపోయింది.
ఇతర బాలికల మ్యాచ్‌ల్లో మెదక్ 10–0తో కొత్తగూడెంపై, నిజామాబాద్ 10–0తో మహబూబ్‌నగర్‌పై, వరంగల్ 10–0తో కరీంనగర్‌పై గెలిచాయి. బాలుర మ్యాచ్‌ల్లో వరంగల్ 10–0తో కొత్తగూడెంపై, మహబూబ్‌నగర్ 4–0తో కరీంనగర్‌పై, నిర్మల్ 12–1తో కామారెడ్డిపై నెగ్గాయి. అంతకు ముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి ఎ. ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాఫ్ట్‌బాల్ సంఘం కార్యదర్శి కె. శోభన్‌బాబు, నిర్మల్ లైబ్రరీ చైర్మన్ ఎ. రాజేందర్, తెలంగాణ ఖోఖో సంఘం అధ్యక్షులు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment