తెలంగాణ బాలికల జట్టుకు టైటిల్ | telangana girls team won sgf title | Sakshi
Sakshi News home page

తెలంగాణ బాలికల జట్టుకు టైటిల్

Dec 1 2016 10:51 AM | Updated on Sep 15 2018 5:45 PM

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) జాతీయ త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్లు సత్తా చాటారుు.

సాక్షి, హైదరాబాద్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) జాతీయ త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్లు సత్తా చాటారుు. అల్వాల్‌లోని పల్లవి మోడల్ స్కూల్‌లో జరిగిన ఈ టోర్నీలో తెలంగాణ బాలికల జట్టు విజేతగా నిలవగా... బాలుర జట్టు రెండో స్థానాన్ని సంపాదించింది. బుధవారం జరిగిన బాలికల ఫైనల్లో తెలంగాణ జట్టు 15-9, 12-15, 15-11తో ఢిల్లీపై గెలుపొందింది. మహారాష్ట్ర జట్టు 15-8, 12-15, 15-13తో హరియాణాపై గెలుపొంది మూడో స్థానంలో నిలిచింది.

 

బాలుర ఫైనల్లో ఢిల్లీ 15-13, 15-12తో తెలంగాణపై గెలిచి విజేతగా నిలవగా... ఛత్తీస్‌గఢ్ 15-9, 15-11తో కర్ణాటకపై నెగ్గి మూడో స్ధానాన్ని దక్కించుకుంది. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ నరేశ్ మన్, ఉపాధ్యక్షుడు రాంరెడ్డి, పల్లవి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సునీర్ నేగి, తెలంగాణ త్రోబాల్ సంఘం కోశాధికారి వెంకట్ పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement