
న్యూఢిల్లీ: ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్‌లో పడుతూ లేస్తూ సాగుతున్న తెలుగు టైటాన్స్‌కు ఊరటనిచ్చే విజయం లభించింది. బుధవారం ఇక్కడ జరిగిన లీగ్ పోరులో టైటాన్స్ 41–34తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై జయభేరి మోగించింది. 18 మ్యాచ్‌లాడిన తెలుగు జట్టుకిది కేవలం ఐదో గెలుపు మాత్రమే. టైటాన్స్ రైడర్ రాహుల్ సింగ్ 17 పాయింట్లు తెచ్చిపెట్టాడు.
నిలేశ్ సాలుంకే 7, డిఫెండర్ విశాల్ భరద్వాజ్ టాకిల్‌లో 5 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో యూపీ యోధ 45–16 స్కోరుతో దబంగ్ ఢిల్లీ జట్టుపై ఏక పక్ష విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగే మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్‌తో యు ముంబా; దబంగ్ ఢిల్లీతో తెలుగు టైటాన్స్ తలపడతాయి.