telugu titans win
-
టైటాన్స్ మూడో విజయం
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో తెలుగు టైటాన్స్ మూడో విజయాన్ని సాధించింది. ఢిల్లీ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 24–21తో జైపూర్ పింక్ పాంథర్స్‌కు షాకిచ్చింది. డిఫెండర్ విశాల్ భరద్వాజ్ 8 టాకిల్ పాయింట్లతో ప్రత్యర్థిని పట్టేయడంలో సఫలం అయ్యాడు. చివర్లో టైటాన్స్ సారథి అబొజర్ తన అనుభవంతో ప్రత్యర్థిని పట్టేసి జట్టుకు విజయాన్ని అందించాడు. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో ఆతిథ్య ఢిల్లీ దబంగ్ 33–31తో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. నేటి మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో బెంగళూరు బుల్స్; యూపీ యోధతో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. -
జెర్సీ మారింది... బోణీ కొట్టింది
అహ్మదాబాద్: మారిన జెర్సీ రంగు తెలుగు టైటాన్స్ జట్టుకు అదృష్టాన్ని తీసుకొచ్చింది. ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్‌లో అందని ద్రాక్షలా ఉన్న గెలుపు ఎట్టకేలకు తెలుగు టైటాన్స్‌ను పలకరించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 30–24తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌ను ఓడించి ఈ లీగ్‌లో తొలి విజయాన్ని అందుకుంది. టైటాన్స్ తరఫున సిద్ధార్థ్ దేశాయ్, విశాల్ భరద్వాజ్‌లు చెరో ఏడు పాయింట్లతో జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు. మ్యాచ్ మొత్తంలో 16 టాకిల్ పాయింట్లు, 11 రైడ్ పాయింట్లతో ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్ చేసిన తెలుగు జట్టు గెలుపు బోణీ కొట్టింది. సీజన్లో ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ పసుపు రంగు జెర్సీతో బరిలో దిగిన టైటాన్స్... గుజరాత్‌తో మ్యాచ్‌లో మాత్రం నల్ల రంగు జెర్సీతో ఆడింది. కొత్త జెర్సీ రంగు ఏం అదృష్టం తెచ్చిందో ఏమో కానీ.. ప్రత్యర్థి జట్టును ఆట ఆరంభమైన ఏడో నిమిషంలోనే ఆలౌట్ చేసింది. మొదటి అర్ధ భాగంలో సిద్ధార్థ్ రైడింగ్‌లో చెలరేగితే... రెండో అర్ధ భాగంలో విశాల్ భరద్వాజ్ తన పట్టుతో ప్రత్యర్థి రైడర్లను పట్టేశాడు. దీంతో గుజరాత్ సొంత మైదానంలో వరుసగా రెండో ఓటమిని నమోదు చేసింది. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 30–33తో హరియాణా స్టీలర్స్ చేతిలో ఓడింది. హరియాణా రైడర్ వికాస్ ఖండోలా 12 పాయింట్లతో రాణించాడు. నేటి మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్; యూపీ యోధతో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
టైటాన్స్ తడాఖా.. హోరెత్తిన విశాఖ
విశాఖ స్పోర్ట్స్: విశాఖలో తెలుగు టైటాన్స్ ఆటగాళ్లు పండగ చేసుకున్నారు. కీలకమైన మ్యాచ్‌లో దుమ్ము రేపి ఇంకా నిలబడ్డామనిపించుకున్నారు. ప్లేఆఫ్‌కు బరిలో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో టైటాన్స్ విజృంభించారు. పాట్నా పైరేట్స్‌పై 41– 36 పాయింట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకున్నారు. జోన్ బిలో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్న ఇరు జట్ల మధ్య ఆధిక్యానికి పోరు జరగగా, అత్యవసర తరుణంలో టైటాన్స్ విజృంభించారు. రైడ్‌లో పైరేట్స్ 24–22 పాయింట్ల తేడాతో టైటాన్స్‌పై ఆధిక్యం కనబరిచినా టాక్లింగ్లో 14–10తో టైటాన్స్ ఆటగాళ్లు తమదే పైచేయనిపించుకున్నారు. సూపర్ రైడ్Š, ఎక్సట్రాలలో టైటాన్స్ ఒకో పాయింట్ సాధించారు. ఆలౌట్ ద్వారా పైరేట్స్ రెండు పాయింట్లు సాధిస్తే టైటాన్స్ నాలుగు పాయింట్ల సాధించారు. రైడ్‌తో టైటాన్ ఆటగాళ్లు రాహుల్ 11, నీలేష్ 6 పాయింట్లు రాబట్టారు. విదేశీ అటగాళ్లు మొహసిన్, ఫర్హాద్, అబ్జోర్ రాణించారు. విశాల్ టాక్లింగ్తో నాలుగు పాయింట్లు సాధించాడు. పైరేట్స్ తరపున పర్దీప్ రైడ్‌లో 10 పాయింట్లు తేగా జైదీప్, వికాశ్ టాక్లింగ్లో సత్తా చూపారు. -
టైటాన్స్ ఘనవిజయం
న్యూఢిల్లీ: ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్‌లో పడుతూ లేస్తూ సాగుతున్న తెలుగు టైటాన్స్‌కు ఊరటనిచ్చే విజయం లభించింది. బుధవారం ఇక్కడ జరిగిన లీగ్ పోరులో టైటాన్స్ 41–34తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై జయభేరి మోగించింది. 18 మ్యాచ్‌లాడిన తెలుగు జట్టుకిది కేవలం ఐదో గెలుపు మాత్రమే. టైటాన్స్ రైడర్ రాహుల్ సింగ్ 17 పాయింట్లు తెచ్చిపెట్టాడు. నిలేశ్ సాలుంకే 7, డిఫెండర్ విశాల్ భరద్వాజ్ టాకిల్‌లో 5 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో యూపీ యోధ 45–16 స్కోరుతో దబంగ్ ఢిల్లీ జట్టుపై ఏక పక్ష విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగే మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్‌తో యు ముంబా; దబంగ్ ఢిల్లీతో తెలుగు టైటాన్స్ తలపడతాయి. -
ఢిల్లీ, తెలుగు టైటాన్స్ మ్యాచ్ టై
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్-2 లో భాగంగా చివరి వరకూ ఉత్యంఠభరితంగా సాగిన దబాంగ్ ఢిల్లీ, తెలుగు టైటాన్స్ టై అయింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు 45-45 పాయింట్లే సాధించడంతో మ్యాచ్ టై అని అంపైర్లు ప్రకటించారు. తొలి అర్ధభాగంలో 20-18తో దబాంగ్ ఢిల్లీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. రెండో అర్ధభాగంలో అసలుసిసలు పోరు ప్రారంభమైంది. ఇరు జట్లు పోటాపోటీగా పాయింట్లు గెలుస్తుండటంతో మ్యాచ్ ఎవరు గెలుస్తారోనని ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. చివరి సెకన్ వరకూ విజయం ఇరు జట్లను దోబూచులాడింది. మ్యాచ్ ఫలితమూ టైగా తేలింది. 12మ్యాచ్ లకు గానూ 7 మ్యాచ్‌లు గెలిచి, 3 మ్యాచ్‌లు టై చేసుకుని, 2 మ్యాచ్‌ల్లో ఓడింది. ముంబాయి జట్టుకు 45 పాయంట్లే ఉన్నప్పటికీ సాంకేతిక అంశాలతో రెండో స్థానంలో ఉంది. దబాంగ్ ఢిల్లీ 26 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతోంది.