పైరేట్స్ ఆటగాళ్లను నిలువరిస్తున్న టైటాన్స్ క్రీడాకారులు
విశాఖ స్పోర్ట్స్: విశాఖలో తెలుగు టైటాన్స్ ఆటగాళ్లు పండగ చేసుకున్నారు. కీలకమైన మ్యాచ్‌లో దుమ్ము రేపి ఇంకా నిలబడ్డామనిపించుకున్నారు. ప్లేఆఫ్‌కు బరిలో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో టైటాన్స్ విజృంభించారు. పాట్నా పైరేట్స్‌పై 41– 36 పాయింట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకున్నారు. జోన్ బిలో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్న ఇరు జట్ల మధ్య ఆధిక్యానికి పోరు జరగగా, అత్యవసర తరుణంలో టైటాన్స్ విజృంభించారు.
రైడ్‌లో పైరేట్స్ 24–22 పాయింట్ల తేడాతో టైటాన్స్‌పై ఆధిక్యం కనబరిచినా టాక్లింగ్‌లో 14–10తో టైటాన్స్ ఆటగాళ్లు తమదే పైచేయనిపించుకున్నారు. సూపర్ రైడ్Š, ఎక్సట్రాలలో టైటాన్స్ ఒకో పాయింట్ సాధించారు. ఆలౌట్ ద్వారా పైరేట్స్ రెండు పాయింట్లు సాధిస్తే టైటాన్స్ నాలుగు పాయింట్ల సాధించారు. రైడ్‌తో టైటాన్ ఆటగాళ్లు రాహుల్ 11, నీలేష్ 6 పాయింట్లు రాబట్టారు. విదేశీ అటగాళ్లు మొహసిన్, ఫర్హాద్, అబ్జోర్ రాణించారు. విశాల్ టాక్లింగ్‌తో నాలుగు పాయింట్లు సాధించాడు. పైరేట్స్ తరపున పర్దీప్ రైడ్‌లో 10 పాయింట్లు తేగా జైదీప్, వికాశ్ టాక్లింగ్‌లో సత్తా చూపారు.
Comments
Please login to add a commentAdd a comment