
పంచకుల (హరియాణా): ప్రొ కబడ్డీ లీగ్ జోన్ ‘బి’లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్‌లో యూపీ యోధా 47–31తో పట్నా పైరేట్స్‌పై గెలిచింది. యోధా తరఫున ప్రశాంత్ 10 పాయింట్లతో మెరవగా... పట్నా తరఫున మన్‌జీత్ 10 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 29–34తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ చేతిలో ఓడింది.