
అవార్డుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం: సోనోవాల్
జాతీయ క్రీడా అవార్డుల ఎంపిక ప్రక్రియను సమీక్షించాల్సిన అవసరం లేదని కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ స్పష్టం చేశారు. అవార్డులకు క్రీడాకారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందన్నారు. సానియాకు ఖేల్ రత్న ఇవ్వడంపై పారాలింపియన్ గిరీష కర్ణాటక హైకోర్టుకు వెళ్లడం, రెజ్లింగ్ కోచ్ అనూప్ సింగ్‌కు ద్రోణాచార్య ఇవ్వడంపై మరో రెజ్లింగ్ కోచ్ వినోద్ కుమార్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం వంటి వివాదాలు ఇటీవల చోటు చేసుకున్నాయి. అయితే వీటిపై స్పందించిన మంత్రి ఎంపిక కమిటీ సరైన నిర్ణయాలే తీసుకుందని సమర్థించారు.