
రెండో టెస్టుకు రాహుల్
ఓపెనర్ కేఎల్ రాహుల్ రెండో టెస్టు కోసం భారత జట్టుతో చేరాడు. తొడ కండరాల గాయం కారణంగా జట్టుకు దూరమైన రాహుల్ పూర్తిగా కోలుకున్నాడని, ఇంగ్లండ్‌తో వైజాగ్‌లో గురువారం మొదలయ్యే రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని జట్టు ప్రకటించింది. గౌతమ్ గంభీర్ స్థానంలో తను మురళీ విజయ్‌తో కలిసి ఇన్నింగ్స్ ను ప్రారంభించే అవకాశం ఉంది.